ఏంటి? అమరావతిని పైకి లేపుతారా?... ట్రిబ్యునల్‌లో నీళ్లు నమిలిన ఏపీ
ఏపీ రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ టిబ్యునల్‌లో ఆసక్తికరంగా వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నలకు ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పిటిషన్ తరపున వాదనలు వినిపించిన సంజయ్ పరేఖ్.. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని అయితే ఎంచుకున్న ప్రాంతంపైనే అభ్యంతరాలు ఉన్నాయన్నారు. రాజధాని ప్రాంతానికి కొండవీటివాగుతో పాటు కృష్ణా నది వరద ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న అమరావతి సముద్రమట్టానికి 21.7మీటర్ల […]

ఏపీ రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ టిబ్యునల్‌లో ఆసక్తికరంగా వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నలకు ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పిటిషన్ తరపున వాదనలు వినిపించిన సంజయ్ పరేఖ్.. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని అయితే ఎంచుకున్న ప్రాంతంపైనే అభ్యంతరాలు ఉన్నాయన్నారు. రాజధాని ప్రాంతానికి కొండవీటివాగుతో పాటు కృష్ణా నది వరద ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న అమరావతి సముద్రమట్టానికి 21.7మీటర్ల ఎత్తులో ఉందని గుర్తు చేశారు. కృష్ణానది వరద నీటి మట్టం 25 మీటర్ల వరకు ఉంటోందని సంజయ్ ఫరేఖ్ వివరించారు. దీని వల్ల అమరావతి పరిధిలో 10వేల ఎకరాల భూమి ఆ మేర వరదల్లో మునిగిపోతుందని చెప్పారు. ఈ విషయం పర్యావరణ మదింపు నివేదికలోనే ఉందని చూపించారు.
నీట మునిగే అమరావతి ప్రాంతాన్ని 25 మీటర్లపైగా హైట్ పెంచుతామని ప్రభుత్వం చెప్పడంపై పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 10వేల ఎకరాలను ఆ స్థాయిలో ఎత్తు పెంచడం సాధ్యమా అని ప్రశ్నించారు. అది ఎలా చేస్తారో ప్రభుత్వం వివరించాలన్నారు. అయితే ప్రభుత్వ తరపున న్యాయవాది గంగూలీ ఎత్తు పెంపుపై సమాధానం చెప్పలేకపోయారు. తదుపరి విచారణను ట్రిబ్యునల్ శుక్రవారానికి వాయిదా వేసింది. అయినా 10వేల ఎకరాల ప్రాంతాన్ని హైట్ పెంచడం కంటే మించిన మూర్ఖపు పని మరొకటి ఉంటుందా?. అన్ని వేల ఎకరాలను ఎత్తు పెంచాలంటే ఎన్నివేల కోట్లు కావాలి. పూటగడవడం కూడా కష్టంగా ఉందంటున్న ప్రభుత్వం ఇలా వేల కోట్లు మట్టిపని కోసం మట్టిలో పోస్తే దాన్ని ఏమనాలి?. ఎంటో చరిత్ర ఎరుగని, సృష్టిలో జరగని అద్భుతాలన్నీ అమరావతిలోనే జరిగేలా ఉన్నాయి.
Click on Image to Read: