మరో దర్శకుడికి ఆఫర్ ఇచ్చిన నాగార్జున
అక్కినేని కాంపౌండ్ లో హీరోలకు ఇప్పుడు కొదవ లేదు. నాగార్జున, నాగచైతన్య, సుమంత్, సుశాంత్ లాంటి హీరోలతో పాటు ఇప్పుడు అఖిల్ కూడా హీరో అయిపోయాడు. దీంతో దర్శకులకు డిమాండ్ బాగా పెరిగింది. హిట్ ఇచ్చిన దర్శకుడ్ని పట్టుకోవడం ఇప్పుడు అక్కినేని హీరోలకు చాలా కష్టంగా మారింది. ఓవైపు తన సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు అలాంటి దర్శకుల కోసం గాలం వేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న విక్రమ్ కుమార్ కు అడ్వాన్స్ ఇచ్చి […]

అక్కినేని కాంపౌండ్ లో హీరోలకు ఇప్పుడు కొదవ లేదు. నాగార్జున, నాగచైతన్య, సుమంత్, సుశాంత్ లాంటి హీరోలతో పాటు ఇప్పుడు అఖిల్ కూడా హీరో అయిపోయాడు. దీంతో దర్శకులకు డిమాండ్ బాగా పెరిగింది. హిట్ ఇచ్చిన దర్శకుడ్ని పట్టుకోవడం ఇప్పుడు అక్కినేని హీరోలకు చాలా కష్టంగా మారింది. ఓవైపు తన సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు అలాంటి దర్శకుల కోసం గాలం వేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న విక్రమ్ కుమార్ కు అడ్వాన్స్ ఇచ్చి అఖిల్ కోసం రెడీ చేశాడు నాగ్. దీనికంటే ముందే కల్యాణ్ కృష్ణను టోటల్ గా తన బ్యానర్ లోనే ఉంచుకున్నారు. నాగచైతన్యతో సినిమా సెట్ చేశాడు. ఇప్పుడు మరో యంగ్ డైరక్టర్ పై కూడా నాగ్ కన్నుపడింది. పెళ్లి చూపులతో సక్సెస్ అందుకున్న తరుణ్ భాస్కర్ కు నాగ్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. తన బ్యానర్ లో ఓ సినిమా చేయమని… హీరోగా తను, చైతూ, అఖిల్ లో ఎవర్నీ సెలక్ట్ చేసుకున్నా ఫర్వాలేదని ఊరిస్తున్నాడు. తరుణ్ భాస్కర్ ఓకే చెబితే, రేపోమాపో అడ్వాన్స్ ఇచ్చి అతడ్ని లాక్ చేయాలని నాగార్జున గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఒకవేళ తరుణ్ కనుక ఒప్పుకుంటే… చైతూ నెక్ట్స్ సినిమా తరుణ్ తోనే ఉండొచ్చు.