Telugu Global
Cinema & Entertainment

అవ‌తార్ ద‌ర్శ‌కుడే చెప్పాడు కాబ‌ట్టి న‌మ్మాల్సిందే..!

ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత సృష్టి ‘అవతార్’. సుమారు 300 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా అద్భుతమయిన గ్రాఫిక్ మాయాజాలంతో ప్రపంచం మొత్తం విజయదుందుబి మోగించి రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి రికార్డ్లు క్రియేట్ చేసింది. దాంతో జేమ్స్ కామెరూన్ ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ సీక్వెల్ గురించి వచ్చిన ఓ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సీక్వెల్స్ అన్ని ఫ్యామీలి […]

అవ‌తార్ ద‌ర్శ‌కుడే చెప్పాడు కాబ‌ట్టి న‌మ్మాల్సిందే..!
X

ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత సృష్టి ‘అవతార్’. సుమారు 300 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా అద్భుతమయిన గ్రాఫిక్ మాయాజాలంతో ప్రపంచం మొత్తం విజయదుందుబి మోగించి రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి రికార్డ్లు క్రియేట్ చేసింది. దాంతో జేమ్స్ కామెరూన్ ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ సీక్వెల్ గురించి వచ్చిన ఓ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సీక్వెల్స్ అన్ని ఫ్యామీలి కథలుగా నడుస్తాయని ఆయన ప్రకటించారు. జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ… “సీక్వెల్ చిత్రం స్టోరీ లైన్ పూర్తిగా ఒరిజనల్ లోని జాక్, జో ల కథలాగానే సాగుతుంది. అలాగే ఈ సీక్వెల్ లో వారి పిల్లలు కూడా కనపడతారు. మనష్యులతో వారికి వచ్చే సమస్యలతో ఈ ఫ్యామిలీ సాగుతుంది,” అన్నారు.

ఇక అవతార్ చిత్రాన్ని జేమ్స్ కామరూన్ దాదాపు ఇరవైఏళ్లు తీశారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ఇదేం విడ్డూరం.. ఇన్నేళ్లా అనుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ, సినిమా విడుదలైన తర్వాత అద్భుతమైన సాంకేతిక మాయాజాలం అని ఒప్పుకున్నారు. మరో, 20, 30 ఏళ్ల వరకు ఇలాంటి అద్భుతాన్ని చూడలేమని కూడా అన్నారు. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్స్ తీస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటానికి సిద్దపడుతున్నారు కామరూన్. ఇదిలా ఉంటే… పండోరా గ్రహం నేపథ్యంలో తొలి భాగం సాగుతుంది. కాగా, ఈ సీక్వెల్స్‌లో ఆ గ్రహంలో గల సముద్ర జలాల అందాలను ఆవిష్కరించాలనుకుంటున్నారట కామరూన్. నీటి లోపలి సన్నివేశాలను కనీవినీ ఎరుగని రీతిలో చిత్రీకరించాలనుకుంటున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారాయన. సాంకేతికంగా అవతార్‌ని మించే స్థాయిలో ఈ సీక్వెల్స్ ఉంటాయని ఆయన తెలిపారు. అవతార్‌ని నిర్మించిన లైట్‌స్టామ్ ఎంటర్‌టైన్‌మెంట్, ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ సంస్థలు ఈ సీక్వెల్స్‌ని నిర్మించనున్నాయి.

First Published:  15 Sept 2016 4:21 AM IST
Next Story