మొదటి రోజే కేకేసిన దేవినేని... ఇద్దరు ఎమ్మెల్యేల డుమ్మా
మొన్నటి వరకు చంద్రబాబుపై ఒంటికాలితో లేచిన సీనియర్ నేత దేవినేని నెహ్రు టీడీపీలో చేరారు. చేరిక సభలోనే చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. అమరావతి సృష్టికర్త చంద్రబాబు అని బిరుదు ఇచ్చేశారు. ఇకపై తాము కూడా అమరావతికి రక్షణ కవచంలా ఉంటామన్నారు. అమరావతి కోసం అవసరమైతే ప్రాణాలిస్తామన్నారు. అమరావతిని అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పట్టిసీమను తొలుత తాను వ్యతిరేకించానని కానీ దాన్ని ఏడాదిలోనే చంద్రబాబు పూర్తి చేశారన్నారు. పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తే టీడీపీలో చేరుతానని గతంలోనే ప్రకటించానని […]
మొన్నటి వరకు చంద్రబాబుపై ఒంటికాలితో లేచిన సీనియర్ నేత దేవినేని నెహ్రు టీడీపీలో చేరారు. చేరిక సభలోనే చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. అమరావతి సృష్టికర్త చంద్రబాబు అని బిరుదు ఇచ్చేశారు. ఇకపై తాము కూడా అమరావతికి రక్షణ కవచంలా ఉంటామన్నారు. అమరావతి కోసం అవసరమైతే ప్రాణాలిస్తామన్నారు. అమరావతిని అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పట్టిసీమను తొలుత తాను వ్యతిరేకించానని కానీ దాన్ని ఏడాదిలోనే చంద్రబాబు పూర్తి చేశారన్నారు. పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తే టీడీపీలో చేరుతానని గతంలోనే ప్రకటించానని చంద్రబాబు ఆ పని చేశారు కాబట్టి ఇప్పుడు టీడీపీలో చేరుతున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీకి రక్షణ కవచంలా ఉంటానని చెప్పారు. తాను 1983లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు, టిడిపి జెండా కప్పుకునే చనిపోతానని చెప్పానని గుర్తు చేశారు. అలాగే చేస్తానన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచే గెలిచానని, దేవినేని అంటే కృష్ణా జిల్లా.. కృష్ణా జిల్లా అంటే దేవినేని అని అన్నారు. మనుషులు పార్టీ మారిన ఇంటిపేరుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. పోలవరం పూర్తి చేసే సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు దేవినేని. ఐదు కోట్ల మందికి చంద్రబాబు ఊపిరి అన్నారు. అప్పట్లో తనకు మంత్రి పదవి ఇప్పించింది కూడా చంద్రబాబేనని చెప్పారు. ఇన్ని రోజులు తాము ఎందుకు దూరంగా ఉన్నామో తెలియడం లేదన్నారు. జగన్‌కు విజయవాడలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలియదన్నారు.
మరోవైపు దేవినేని నెహ్రు చేరికపై ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. నెహ్రు చేరిక సభకు వారిద్దరూ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో వారిని చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. ఎవరి పని వారు చేసుకుపోవాలని వారిద్దరికీ సూచించినట్టు తెలుస్తోంది. పార్టీ బలహీనపడకుండా ఉండాలంటే కొందరిని చేర్చుకోక తప్పదని చంద్రబాబు ఇద్దరు ఎమ్మెల్యేలను బుజ్జగించినట్టు చెబుతున్నారు.
Click on Image to Read: