చంద్రబాబును శరణుగోరిన ఆరుగురు పోలీస్ అధికారులు
తన సంసారం బాగాలేకున్నా.. పక్కోడి ఇంట్లో మంట పెట్టడం అంటే చంద్రబాబుకు ఎక్కడలేని ఆనందం వస్తుందేమో! తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చి ఓటుకు నోటుతో చేయి కాల్చుకున్నా.. ఆయన తీరు మారినట్లుగా కనిపించడం లేదు. తాజాగా నయీం కేసులోనూ ఆయన వేలు పెట్టినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ నయీం సామ్రాజ్యం పురుడుపోసుకున్నది టీడీపీ హయాంలోనే అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నయీం కేసుపైనా చంద్రబాబు ఫోకస్ పెట్టారని ప్రముఖ తెలుగు పత్రిక విశ్వసనీయ సమాచారంతో కథనం రాసింది. దాని ప్రకారం […]
తన సంసారం బాగాలేకున్నా.. పక్కోడి ఇంట్లో మంట పెట్టడం అంటే చంద్రబాబుకు ఎక్కడలేని ఆనందం వస్తుందేమో! తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చి ఓటుకు నోటుతో చేయి కాల్చుకున్నా.. ఆయన తీరు మారినట్లుగా కనిపించడం లేదు. తాజాగా నయీం కేసులోనూ ఆయన వేలు పెట్టినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ నయీం సామ్రాజ్యం పురుడుపోసుకున్నది టీడీపీ హయాంలోనే అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నయీం కేసుపైనా చంద్రబాబు ఫోకస్ పెట్టారని ప్రముఖ తెలుగు పత్రిక విశ్వసనీయ సమాచారంతో కథనం రాసింది. దాని ప్రకారం నయీం కేసు దర్యాప్తు ముందుకెళ్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పావులు కదుపుతున్నారు చంద్రబాబు. నయీంతో టీఆర్‌ఎస్ నేతలకు లింకులు ఉన్నా వదిలిపెట్టవద్దని కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో సిట్ చాలా దూకుడుగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నయీంతో కలిసి నడిచిన ఆరుగురు పోలీసు అధికారులు ఇప్పుడు చంద్రబాబు శరణు కోరారు. వారితో పాటు తెలంగాణ టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలు కూడా తమను రక్షించాలంటూ చంద్రబాబును ఆశ్రయించారు. ఆ ఆరుగురు పోలీసు అధికారులు కూడా ఒకే సామాజికవర్గం వారట. దీంతో తన వారు ఇబ్బందుల్లో పడేసరికి చంద్రబాబు తన వ్యూహానికి పదునుపెట్టారు. సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును తెలివిగా తెరపైకి తెచ్చి నయీం కేసు విచారణకు బ్రేక్ వేసేందుకు సిద్దమయ్యారు.
సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అప్పటి గుజరాజ్ హోంమంత్రి అమిత్‌షాపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అప్పట్లో నయీంను కలిసి తిరిగి వెళ్తున్న సమయంలోనే గుజరాత్ పోలీసులు సొహ్రాబుద్దీన్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఆ సమయంలో ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే ఎన్‌కౌంటర్ జరిగిందన్నది ఆరోపణ. ఇప్పుడు దీన్ని అసరాగా చేసుకుని తన వాళ్లను గట్టెక్కించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. చంద్రబాబును ఆశ్రయించిన ఆరుగురు పోలీసు అధికారులు … కేవలం సొహ్రాబుద్దీన్ గురించి తెలుసుకునేందుకే నయీంతో సంబంధాలు కొనసాగించారని అంతకు మించి వారికి ఏపాపం తెలియదని చంద్రబాబు కేంద్ర హోంశాఖకు విన్నవించబోతున్నారు. ఒకవిధంగా సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌లో గుజరాత్ ప్రభుత్వానికి సదరుపోలీస్ అధికారులు రిస్క్ తీసుకుని సహకరించారన్న భావనను కేంద్ర పెద్దలకు కలిగించబోతున్నారు. అలా చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి ఆ ఆరుగురు పోలీసులను బయటపడేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంటే నయీం కేసును కూడా మరో ఓటుకు నోటు కేసులా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నట్టు ఉంది. ఈసారి కూడా కేసీఆర్ తలొగ్గుతారో లేదో చూడాలి.
Click on Image to Read: