సిరిసిల్ల పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న కేటీఆర్!
సీఎం కుమారుడు, తెలంగాణ ఐటీ- పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖలకు మంత్రి, కరీంనగర్ జిల్లాకు పార్టీపరంగా పెద్దదిక్కు, సిరిసిల్ల నుంచి 2009, 2010, 2014 వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం.. మొత్తానికి రాష్ట్రంలో నెంబర్.2, కేసీఆర్ రాజకీయ వారసుడు, తరువాత సీఎం అబ్బో..! ఇలా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ కు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అంతా ఇంతా కాదు. ఇంత ఇమేజ్ ఉన్న కేటీఆర్ ఇప్పుడు సిరిసిల్ల పేరు చెబితే మాత్రం ఉలిక్కి పడుతున్నాడు. ఇంతకీ ఎందుకంటారా? […]
BY sarvi13 Sept 2016 10:53 PM GMT
X
sarvi Updated On: 13 Sept 2016 11:09 PM GMT
సీఎం కుమారుడు, తెలంగాణ ఐటీ- పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖలకు మంత్రి, కరీంనగర్ జిల్లాకు పార్టీపరంగా పెద్దదిక్కు, సిరిసిల్ల నుంచి 2009, 2010, 2014 వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం.. మొత్తానికి రాష్ట్రంలో నెంబర్.2, కేసీఆర్ రాజకీయ వారసుడు, తరువాత సీఎం అబ్బో..! ఇలా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ కు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అంతా ఇంతా కాదు. ఇంత ఇమేజ్ ఉన్న కేటీఆర్ ఇప్పుడు సిరిసిల్ల పేరు చెబితే మాత్రం ఉలిక్కి పడుతున్నాడు. ఇంతకీ ఎందుకంటారా? ఇంకెందుకు? సిరిసిల్లను జిల్లాను చేయాలన్న డిమాండ్‌పై స్థానికులు వెనక్కి తగ్గకపోవడమే ఇందుకు కారణం.
తొలుత సిరిసిల్లను జిల్లాల జాబితాలో చేర్చి తరువాత తూచ్ అన్నందుకు సిరిసిల్లలో అగ్గి రాజేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ నాయకత్వంలో సిరిసిల్లలో ఉద్యమాన్ని హోరెత్తించిన సొంతపార్టీ నేతలే ఆయన ప్లెక్సీని తగలబెట్టేశారు. అంతేనా సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. సిరిసిల్ల జిల్లాగా ప్రకటించేంత వరకు నియోజకవర్గానికి రాకూడదంటూ అల్టిమేటం జారీ చేశారు. పరిస్థితి రోజురోజుకు ఉధృతమవుతుండటంతో అధికార పార్టీ నాయకులు ప్రజలకు ముఖాలు చూపెట్టే సాహసం చేయడం లేదు. మా ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాల్సిందేనంటూ సిరిసిల్ల మునిసిపాలిటీ కౌన్సిలర్లంతా రాజీనామాలు చేశారు. స్థానిక రాజకీయ నాయకులంతా ఏకమై జేఏసీగా ఒక్కటై పోరాటాలు చేస్తున్నారు.
పరిస్థితి తీవ్రతను కేటీఆర్‌కు వివరించారు స్థానిక గులాబీనేతలు. జిల్లా ఏర్పాటు చేయకపోతే ప్రజల్లో తలెత్తుకోలేమని స్పష్టం చేశారు. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక కారణాల దృష్ట్యా జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని ఆయన తేల్చేశారు. సిరిసిల్ల నడిబొడ్డున నిలబడి క్షమాపణలు కోరుతాను శాంతించండి అని ప్రజలకు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో వారంతా నిరాశగా ఇంటిముఖం పట్టారు. కానీ, స్థానిక ఐకాస మాత్రం ఆందోళనలు ఆపడం లేదు. జిల్లా ప్రకటన వచ్చేవరకు ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం ప్రజల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత కలలో కూడా ఊహించి ఉండడు కేటీఆర్ .
Next Story