Telugu Global
NEWS

పవన్‌ గురించి మాట్లాడితే తప్పేంటి? ఫ్యాన్స్‌పై రేణు ఫైర్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్‌ ఒక ఇంటర్వ్యూలో కాస్త ఘాటుగా స్పందించారు. పవన్‌ కల్యాణ్ గురించి తాను ఏదైనా మాట్లాడితే సోషల్ మీడియాలో కొందరు తనపై తీవ్ర పదజాలంతో అటాక్ చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రపంచం మొత్తం పవన్‌ గురించి మాట్లాడవచ్చు గానీ తాను మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. తాను 11 ఏళ్ల పాటు పవన్‌కు భార్యగా ఉన్నానని ఆ విషయం ఎందుకు మరిచిపోతున్నారని ప్రశ్నించారు. తాను పవన్‌ గురించి ట్వీట్ చేస్తే చాలా […]

పవన్‌ గురించి మాట్లాడితే తప్పేంటి? ఫ్యాన్స్‌పై రేణు ఫైర్
X

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్‌ ఒక ఇంటర్వ్యూలో కాస్త ఘాటుగా స్పందించారు. పవన్‌ కల్యాణ్ గురించి తాను ఏదైనా మాట్లాడితే సోషల్ మీడియాలో కొందరు తనపై తీవ్ర పదజాలంతో అటాక్ చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రపంచం మొత్తం పవన్‌ గురించి మాట్లాడవచ్చు గానీ తాను మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. తాను 11 ఏళ్ల పాటు పవన్‌కు భార్యగా ఉన్నానని ఆ విషయం ఎందుకు మరిచిపోతున్నారని ప్రశ్నించారు. తాను పవన్‌ గురించి ట్వీట్ చేస్తే చాలా మంది సంతోషిస్తారని .. కొందరు మాత్రం చాలా దారుణంగా స్పందిస్తున్నారని చెప్పారు. ఒక హీరో నచ్చకపోతే వదిలేయాలి గానీ.. ఆయన్ను, ఆయన భార్య, కుటుంబసభ్యుల గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కొందరు ఏవేవో బూతులు కూడా తిడుతుంటారని వారిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. హీరోలంతా కలిసే ఉంటారని ఫ్యాన్స్ మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో తెలియడం లేదన్నారు. పవన్ కల్యాణ్ అంగీకారంతోనే తాను కొన్ని ఫొటోలను షేర్ చేస్తుంటానని చెప్పారు. పిల్లల కోసం అప్పుడప్పుడు తాము కలుస్తుంటామని రేణుదేశాయ్ వెల్లడించారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నామని చెప్పారు.

Click on Image to Read:

tangirala-sowmya

magunta-sreenivasulu-reddy

chandrababu-naidu-polavaram

mahesh-babu

mudragada-chandrababu-naidu

governor-narasimhan-chandrababu-naidu-1

venkaiah-naidu

national-alliance-of-peoples-movements-ramakrishnama-raju

c-ramachandraiah

First Published:  14 Sept 2016 2:39 PM IST
Next Story