చిరకాల స్వప్నం నెరవేరినట్లేనా?
మోత్కుపల్లి నరసింహులు..గవర్నర్ పదవి కోసం చాలాకాలంగా తపస్సు చేస్తోన్న సీనయర్ నేత. ఈయన ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న గవర్నర్ పదవి త్వరలోనే ఈయను వరించేలా ఉంది. తాజాగా ఖాళీ అయిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ పదవికి మోత్కుపల్లి పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్రం మోత్కుపల్లి నరసింహులు పొలిటికల్ రికార్డు తెప్పించుకున్న దరిమిలా దేశంలో గవర్నర్ల మార్పు జరగడంతో మోత్కుపల్లి శిబిరంలో మళ్లీ ఆశలు రేగాయి. ఈసారి మాత్రం మోత్కుపల్లి పేరు ఖాయమయ్యేలానే కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం […]
BY sarvi14 Sept 2016 2:30 AM IST
X
sarvi Updated On: 15 Sept 2016 7:06 AM IST
మోత్కుపల్లి నరసింహులు..గవర్నర్ పదవి కోసం చాలాకాలంగా తపస్సు చేస్తోన్న సీనయర్ నేత. ఈయన ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న గవర్నర్ పదవి త్వరలోనే ఈయను వరించేలా ఉంది. తాజాగా ఖాళీ అయిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ పదవికి మోత్కుపల్లి పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్రం మోత్కుపల్లి నరసింహులు పొలిటికల్ రికార్డు తెప్పించుకున్న దరిమిలా దేశంలో గవర్నర్ల మార్పు జరగడంతో మోత్కుపల్లి శిబిరంలో మళ్లీ ఆశలు రేగాయి. ఈసారి మాత్రం మోత్కుపల్లి పేరు ఖాయమయ్యేలానే కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఎన్టీఆర్ కి , పార్టీకి వీరవిధేయుడిగా ఉంటూ వస్తోన్న నేత మోత్కుపల్లి నరసింహులు కృషి ఫలించే దశకు చేరుకుంది.
2009 నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చినా.. ఈయన మాత్రం పార్టీ ఆదేశాలకు కట్టుబడి తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నారు. దీనికి ఆయన ఫలితం చవిచూశారు. 2014 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయినా సరే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరుపడ్డ కేసీఆర్‌ను విమర్శిస్తూ ప్రజల్లో మరింత వ్యతిరేకత పెంచుకున్నారు. అయినా పార్టీ స్టాండ్‌ను ఏనాడూ మీరలేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు.
ఇతర పార్టీలు భారీ పదవులు ఆఫర్ చేసినా మోత్కుపల్లి పార్టీని వీడలేదు. 2014 ఎన్నికల ఓటమి అనంతరం తెలంగాణలో టీడీపీని చంద్రబాబు వదిలేయదలచుకోలేదు. ఇక్కడ నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే.. 2014 సార్వత్రిక ఎన్నికల పొత్తులో భాగంగా ఒక గవర్నర్ పదవిని ఇస్తామని టీడీపీకి ఎన్డీఏ ఇప్పటికే హామీ ఇచ్చింది. అందులో భాగంగానే.. సీనియర్ నేత మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లు దాటుతున్నా.. ఆ కల సాకారం కాలేదు. ఇటీవల తమిళనాడుతోపాటు మరికొన్ని రాష్ర్టాల గవర్నర్ల పదవీకాలం ముగిసింది. వాటికి మోత్కుపల్లి పేరు పరిశీలనకువచ్చినా ఆఖరు నిమిషంలో తప్పిపోయింది. ఈసారి మాత్రం మోత్కుపల్లి పేరు ఖాయమవుతుందన్న సంకేతాలు అందుతున్నాయని చర్చ జరుగుతోంది.
Next Story