ఎర్త్ ఏ రెడ్డికో?
ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని చంద్రబాబు స్వయంగా పిలిపించుకోవడం చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రే కలవాల్సిందిగా మాగుంటకు చంద్రబాబు కబురుపంపారట. కానీ ఆసమయంలో కరణం బలరాం కూడా మరో పని మీద విజయవాడ క్యాంపు ఆఫీసుకు వచ్చి ఉండడంతో మంగళవారం ఉదయం కలుద్దామంటూ శ్రీనివాసరెడ్డిని చంద్రబాబు వెనక్కు పంపారు. తిరిగి మంగళవారం ఉదయం కలిసిన మాగుంట శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. ”మీ వ్యాపారాలు ఇప్పుడు మీరు లేకున్నా […]
ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని చంద్రబాబు స్వయంగా పిలిపించుకోవడం చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రే కలవాల్సిందిగా మాగుంటకు చంద్రబాబు కబురుపంపారట. కానీ ఆసమయంలో కరణం బలరాం కూడా మరో పని మీద విజయవాడ క్యాంపు ఆఫీసుకు వచ్చి ఉండడంతో మంగళవారం ఉదయం కలుద్దామంటూ శ్రీనివాసరెడ్డిని చంద్రబాబు వెనక్కు పంపారు. తిరిగి మంగళవారం ఉదయం కలిసిన మాగుంట శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. ”మీ వ్యాపారాలు ఇప్పుడు మీరు లేకున్నా నడిచే పరిస్థితి ఉందా?. మీ పిల్లలు వాటిని చూసుకోగలరా?. మీరు పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించగలరా” అని చంద్రబాబు మాగుంటను ప్రశ్నించారట. ఇందుకు స్పందించిన మాగుంట తాను లేకున్నా వ్యాపారాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఇప్పటికే తాను నెలలో 20 రోజులు నియోజకవర్గ ప్రజల కోసం స్థానికంగా ఉంటున్నానని వివరించారు. తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబుతో చెప్పారని సమాచారం.
చంద్రబాబు అడిగిన విషయాలను బట్టి మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారని భావిస్తున్నారు. ఆర్థికంగా బాగా ఉండడంతో పాటు ఢిల్లీ స్థాయిలోనూ మాగుంటకు మంచి సంబంధాలు ఉండడంతో చాలా విషయాల్లో పనికొస్తారని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. పైగా కేబినెట్ విస్తరణలో బెర్త్ కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఫిరాయింపు ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి క్యూలో ఉన్నారు. అంటే మాగుంటతో కలిపితే మొత్తం ఐదుగురు రెడ్లు మంత్రి పదవి కోసం పోటీపడుతునట్టు అవుతుంది. అప్పుడు ఉన్నవాళ్లను తీసేసి కొత్తవాళ్లతో రీ ప్లేస్ చేస్తారా?. లేకుంటే సోమిరెడ్డి, భూమాకు హ్యాండిచ్చి డబ్బున్న మాగుంటకు పెద్దపీట వేస్తారా అన్నది చూడాలి.
Click on Image to Read: