తెలుగుదేశంలో అసంతృప్తి సెగలు!
తెలంగాణ తెలుగుదేశంలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. 15 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. ఎన్ని అవమానాలు, ఛీత్కారాలు ఎదురైనా పార్టీ జెండా మోస్తున్న వారిని కాదని నిన్నగాక మొన్నొచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల నాయకులను పైకి రాకుండా అడ్డుకునేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలుగు యువత కొత్త కమిటీ నియామకం తెలుగుదేశంలో అసంతృప్తి జ్వాలలు రగిల్చేలా చేసింది. […]
BY sarvi13 Sept 2016 5:42 AM IST
X
sarvi Updated On: 13 Sept 2016 9:19 AM IST
తెలంగాణ తెలుగుదేశంలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. 15 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. ఎన్ని అవమానాలు, ఛీత్కారాలు ఎదురైనా పార్టీ జెండా మోస్తున్న వారిని కాదని నిన్నగాక మొన్నొచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల నాయకులను పైకి రాకుండా అడ్డుకునేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలుగు యువత కొత్త కమిటీ నియామకం తెలుగుదేశంలో అసంతృప్తి జ్వాలలు రగిల్చేలా చేసింది.
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నేతలకు తెలుగుయువత కమిటీల నాయకుల నియామకంలో తమ కేడర్‌కు అన్యాయం జరిగిందని సీనియర్లు ఆరోపిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని కొత్తవారికి కమిటీలో చోటు దక్కించడంపై యువ నాయకులు, సీనియర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పనిచేస్తోన్న సీనియర్ యువ నాయకులను కాదని తమకు నచ్చిన వారికి పదవులను కట్టబెట్టడం వ్యూహాత్మకమేనంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులే ఈ కుట్రకు సూత్రధారులని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తెలుగుయువత కమిటీలో సీనియర్ యువనాయకులకు పదవులిస్తే.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌కు పోటీ పడతామనే ఆందోళనతో తమకు అన్యాయం చేశారని వాపోతున్నారు.
Next Story