Telugu Global
National

ఒంటరి మహిళను ఒంటరిగానే వదిలేస్తున్న మహానగరం

ముంబాయి. ఎంతో మంది కలల సాకారం చేసే మహానగరం. చేయాలన్న ఆలోచన ఉండాలే గానీ ప్రతి ఒక్కరికీ ఎదో ఒక ఉపాధి. బతకగలం అన్న ధైర్యం ఇచ్చే నగరం. కానీ ఈ మహానగరానికి ఒక వైకల్యం ఉంది. ఈ నగరం ఒంటరి మహిళలను అంగీకరించడం లేదు. చదువు కోసం వచ్చిన అమ్మాయి అయినా… ఐటీ ఉద్యోగం చేసే ఉద్యోగిని అయినా, భర్త నుంచి విడిపోయిన మహిళ అయినా సరే మహానగరంలో అద్దె గది దొరకడం లేదు. ఈ […]

ఒంటరి మహిళను ఒంటరిగానే వదిలేస్తున్న మహానగరం
X

ముంబాయి. ఎంతో మంది కలల సాకారం చేసే మహానగరం. చేయాలన్న ఆలోచన ఉండాలే గానీ ప్రతి ఒక్కరికీ ఎదో ఒక ఉపాధి. బతకగలం అన్న ధైర్యం ఇచ్చే నగరం. కానీ ఈ మహానగరానికి ఒక వైకల్యం ఉంది. ఈ నగరం ఒంటరి మహిళలను అంగీకరించడం లేదు. చదువు కోసం వచ్చిన అమ్మాయి అయినా… ఐటీ ఉద్యోగం చేసే ఉద్యోగిని అయినా, భర్త నుంచి విడిపోయిన మహిళ అయినా సరే మహానగరంలో అద్దె గది దొరకడం లేదు. ఈ అంశంపై ఒక ఆంగ్ల వెబ్‌ మీడియా ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. పలువురు మహిళలతో మాట్లాడి వారి బాధలను తెలుసుకుని ప్రజల ముందుంచింది. ఏ మహిళ అయినా అద్దె ఇంటికోసం వెళ్తే తొలుత ఎవరెవరు ఉంటారు అన్న ప్రశ్న అడుగుతున్నారు. తాను ఉద్యోగం చేస్తాను ఇంకా పెళ్లి కాలేదు, ఒంటరిగానే ఉంటా అంటే అద్దెకు ఇల్లు ఇవ్వడం వీలు కాదని చెప్పేస్తున్నారు.

ఒక ఐటీ ఉద్యోగిని తాను ముంబాయిలో అద్దె గది సాధించేందుకు ఆరు నెలలు పట్టిందని, అత్యంత ఇబ్బందికరమైన రోజులు అవేనని గుర్తు చేసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చిన తాను ఒంటరిగా జీవించేందుకు సిద్ధపడినా ముంబాయి మాత్రం సహకరించలేదని మరో ఒంటరి మహిళ ఆవేదన చెందారు. ముంబాయిలో అద్దె ఇల్లు తీసుకుని చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా ఒకరు తోడు ఉండాలన్నది అద్దె ఇంటికి అర్హతగా మారిందని పలువురు యువ మహిళలు వాపోయారు. ముంబాయి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా మానసికంగా మాత్రం మరుగుజ్జు రూపాన్ని దాల్చిందని మరో ఒంటరి మహిళ ఆవేదన. ఒకవేళ పరిస్థితిని అర్థం చేసుకుని ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు కొందరు ముందుకు వస్తున్నా.. వారు కూడా ఒంటరి మహిళల విషయంలో సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. చీకటిపడేలోగా ఇంటికి చేరాలంటూ అద్దెకుండే మహిళలపై ఆర్డర్స్‌ వేస్తున్నారు. ఏ మగవాడిని తీసుకురాకూడదు. సిగరెట్లు, మద్యం తాగడంవంటివి అస్సలు చేయకూడదు అంటూ నిబంధనలు పెడుతున్నారు. ముంబాయిలో ఉద్యోగం సంపాదించడం సులువేగానీ… ఒంటరిగా ఉండేందుకు అద్దెగది సంపాదించడమే పెద్ద చాలెంజ్‌ అని ఒక యువ సాప్ట్‌వేర్ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఒంటరి మహిళను ముంబాయి ఒంటరిని చేసి ఆడుకుంటోంది.

Click on Image to Read:

swiss-challenge

sabbam-hari

c-ramachandraiah

janasena-book

telugu-desam

pawan-janasena

andhra-pradesh-intellectuals

ntr

pawan

kottapalli-geeta

rajashekar-reddy-ysr

chandrababu-naidu-01

chintakayala-chinna-rajappa

First Published:  13 Sept 2016 3:05 PM IST
Next Story