గవర్నర్ పదవిపై మోత్కుపల్లికే క్లారిటీ లేదట!
అత్త తిట్టిందాని కంటే.. తోడి కోడలు నవ్విందానికే బాధ ఎక్కువ అన్న చందంగా ఉంది తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు పరిస్థితి. గవర్నర్ పదవి ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో రాదో తెలియదు గానీ మీడియా అడిగే ప్రశ్నలకు ఆయన ఎక్కువ బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మహానాడులో వేదికపై పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ నరసింహులు అని సంబోధించడంతో ఆయనకు గవర్నర్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆయన […]
BY sarvi12 Sept 2016 8:01 PM GMT
X
sarvi Updated On: 12 Sept 2016 11:21 PM GMT
అత్త తిట్టిందాని కంటే.. తోడి కోడలు నవ్విందానికే బాధ ఎక్కువ అన్న చందంగా ఉంది తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు పరిస్థితి. గవర్నర్ పదవి ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో రాదో తెలియదు గానీ మీడియా అడిగే ప్రశ్నలకు ఆయన ఎక్కువ బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మహానాడులో వేదికపై పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ నరసింహులు అని సంబోధించడంతో ఆయనకు గవర్నర్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆయన కూడా గవర్నర్ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నాడు. దేశంలో ఏ రాష్ట్రం గవర్నర్ పదవీకాలం పూర్తయినా.. ఆ పదవి తననే వరిస్తుందని కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నాడు. దీంతో ఆయన ఏ వేదికపై కలిసినా విలేకరులంతా మీరు గవర్నర్ ఎప్పుడు అవుతున్నారు? అని ప్రశ్నించడం ఆయన గుండెలను కల్లుక్కుమనేలా చేస్తున్నాయి. అందుకే, గవర్నర్ పదవి రావడంపై నాకే క్లారిటీ లేదు. సమయం వచ్చినపుడు నేనే చెబుతా.. అంతవరకు నన్ను ఈ ప్రశ్న అడగవద్దని పరోక్షంగా విజ్ఞప్తి చేశారు.
పాపం! మోత్కుపల్లి ఇటీవల తమిళనాడు గవర్నర్ గా రోశయ్య పదవీకాలం పూర్తయిన సమయంలో అవకాశం వస్తుందని ఆశించారు. కానీ, ఆ పదవి ఆయనకు రాలేదు. దాంతో ఇక తనకు పదవి రాదనుకుని డిసైడ్ అయ్యారు. ఇటీవల కేంద్రం మోత్కుపల్లి బయోడేటా తెప్పించుకుందన్న వార్త కూడా ఆయనలో అడుగంటిన ఆశలను మళ్లీ చిగురించేలా చేసింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్ కోవా ను పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు పరిణామాలను బేరీజు వేసుకుంటే మోత్కుపల్లికి అవకాశం రావచ్చు.. రాకపోవచ్చు. ఎందుకంటే… ఇప్పటికే బీజేపీలో ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. వారందరినీ కాదని మోత్కుపల్లికి అవకాశం రావాలంటే..మాటలు కాదు.
Next Story