మల్లన్న పోరాటంలో ఒక్కతాటిపై విపక్షాలు!
మల్లన్నసాగర్ వివాదంపై ప్రజామద్దతును కూడగట్టడంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయా? వీరితో కలిసి పోరాడేందుకు ప్రజాసంఘాలు కలిసి వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముంపు గ్రామం వేములఘాట్ నిర్వాసితులు చేపట్టిన దీక్ష 100 రోజులకు చేరుకుంది. దీనికి తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఇందిరాపార్కువద్ద మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి వేములఘాట్ దీక్షకు మద్దతుగా మహాధర్నా కూడా నిర్వహించారు. ఈ ధర్నాకు టీపీసీసీ చీఫ్ […]
BY sarvi11 Sept 2016 10:08 PM GMT
X
sarvi Updated On: 12 Sept 2016 12:58 AM GMT
మల్లన్నసాగర్ వివాదంపై ప్రజామద్దతును కూడగట్టడంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయా? వీరితో కలిసి పోరాడేందుకు ప్రజాసంఘాలు కలిసి వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముంపు గ్రామం వేములఘాట్ నిర్వాసితులు చేపట్టిన దీక్ష 100 రోజులకు చేరుకుంది. దీనికి తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఇందిరాపార్కువద్ద మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి వేములఘాట్ దీక్షకు మద్దతుగా మహాధర్నా కూడా నిర్వహించారు. ఈ ధర్నాకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తదితర సీనియర్ నేతలు వచ్చారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, జస్టిస్ చంద్రకుమార్ తదిరులు రావడంతో మహాధర్నాకు బలం చేకూరిందని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
ప్రతిపక్షాలు ఈసారి మల్లన్నసాగర్ ను వ్యతిరేకించకుండానే.. భూసేకరణ చట్టం-2013 ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం విశేషం. వచ్చిన అన్నిపార్టీల నేతలు, స్వచ్ఛంద, ప్రజా సంఘాల నేతలు ఇదేమాటపై నిలబడటం విశేషం. జీవో నెంబరు 123 అవసరం లేదని మూకుమ్మడిగా చెప్పేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఒక్కతాటిపైకి రావడం ప్రభుత్వాన్ని తప్పకుండా ఇరుకున పెట్టే అంశం అవుతుందనడంలో సందేహం లేదు. పైగా పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ భుజాలకెత్తుకోవడం జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని ప్రకటిచండంతో అధికార పార్టీ దీనిపై దృష్టి సారించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టును వ్యతిరేకించకుండా మెరుగైన ప్యాకేజీ కోసం రైతుల పక్షాన పోరాడుతామంటే ప్రజలంతా స్వాగతిస్తారు. మరి మల్లన్నసాగర్ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఇదే ఐక్యతతో ముందుకుసాగితే.. ప్రభుత్వానికి కష్టాలు తప్పేలా లేవు.
Next Story