భార్యని వివస్త్రను చేసి చితకబాదిన భర్త... అవమానంతో భార్య ఆత్మహత్య!
నీళ్లు వేడి చేసుకునే వాటర్ హీటర్ ఎక్కువ సేపు వాడిందన్న సాకుతో భార్యను చితకబాదాడు ఓ కసాయి భర్త. కనీసం భార్య ఒంటిపై దుస్తులు లేవన్న ఇంగీతజ్ఞానం మరిచి పశువులా ఆమెమీద పడి చితకబాదాడు. పక్కనే తోడికోడలు ఆమె పిల్లలు చూస్తున్నారన్న సోయి మరిచి గొడ్డును బాదినట్లు బాదాడు. ఈ అవమానంతో ఆ గృహిణి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. హృదయ విదారకమైన ఈ సంఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ పరిధిలోని పూసలబస్తీలో ఆదివారం జరిగింది. సూర్యాపేటకు చెందిన […]
BY sarvi12 Sept 2016 1:31 AM IST
X
sarvi Updated On: 12 Sept 2016 4:35 AM IST
నీళ్లు వేడి చేసుకునే వాటర్ హీటర్ ఎక్కువ సేపు వాడిందన్న సాకుతో భార్యను చితకబాదాడు ఓ కసాయి భర్త. కనీసం భార్య ఒంటిపై దుస్తులు లేవన్న ఇంగీతజ్ఞానం మరిచి పశువులా ఆమెమీద పడి చితకబాదాడు. పక్కనే తోడికోడలు ఆమె పిల్లలు చూస్తున్నారన్న సోయి మరిచి గొడ్డును బాదినట్లు బాదాడు. ఈ అవమానంతో ఆ గృహిణి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. హృదయ విదారకమైన ఈ సంఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ పరిధిలోని పూసలబస్తీలో ఆదివారం జరిగింది. సూర్యాపేటకు చెందిన సుశృత (30)కు పూసలబస్తీకి చెందిన నూతలగంటి మోహన్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మోహన్ ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. కొంతకాలంగా సుశృతపై అనుమానంతో భర్త, అత్తామామలు మానసికంగా వేధిస్తున్నారు. ఎన్నిసార్లు సర్దుకుపోయినా ఏదో కారణంతో హింసిస్తున్నారు.
ఆదివారం వేడినీళ్లు ఎక్కువ సేపు పెట్టిందంటూ కుమారుడు మోహన్‌ను కోడలు సుశృతపై ఉసిగొల్పారు. ఆమె బాత్రూంలో ఉండగానే వెళ్లి చితకబాదాడు. బాత్రూమ్లో నుంచి బయటికి లాక్కొచ్చాడు. అత్తామామ, తోడికోడలు, ఆమె పిల్లలు చూస్తుండగానే చితకబాదాడు. ఆమె ఒంటిపై బట్టలు లేవన్న విషయం మరిచి పశువులా ప్రవర్తించాడు. ఇంకోసారి హీటర్ వాడను, తప్పయింది వదిలేయమని కాళ్లావేళ్లా పడ్డా వినకుండా గొడ్డును బాదినట్లు బాదాడు. అందరిముందు జరిగిన అవమానానికి సుశృత తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులకు వాట్సాప్‌లో జరిగిందంతా మెసేజ్ పెట్టి గదిలోకెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సుశృత తల్లిదండ్రులు మాత్రం ఇది కచ్చితంగా హత్యేనని భర్త, అత్తామామలు కలిసి తమ కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Next Story