Telugu Global
NEWS

చంద్రబాబుపైనే అనుమానం వచ్చేలా చేస్తున్నారు...

 ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు రోజురోజుకు రూపాంతరం చెందుతున్న తీరు చాలా ముచ్చటగా ఉంది. తిరుపతిలో ప్రత్యేక హోదా పదేళ్లు కాదు 15ఏళ్లు కావాలన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అది సంజీవిని కాదన్నారు. జనం కస్సుమనే సరికి హోదా కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు ప్యాకేజ్‌కు స్వాగతం పలికేశారు. ఈ నేపథ్యంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మరో అడుగు ముందుకేశారు. హోదా ఇవ్వాలని చంద్రబాబు అసలు ఏనాడు అడగనేలేదని సెలవిచ్చారు. కేవలం 5లక్షల కోట్లు ఇవ్వాలని […]

చంద్రబాబుపైనే అనుమానం వచ్చేలా చేస్తున్నారు...
X

ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు రోజురోజుకు రూపాంతరం చెందుతున్న తీరు చాలా ముచ్చటగా ఉంది. తిరుపతిలో ప్రత్యేక హోదా పదేళ్లు కాదు 15ఏళ్లు కావాలన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అది సంజీవిని కాదన్నారు. జనం కస్సుమనే సరికి హోదా కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు ప్యాకేజ్‌కు స్వాగతం పలికేశారు. ఈ నేపథ్యంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మరో అడుగు ముందుకేశారు. హోదా ఇవ్వాలని చంద్రబాబు అసలు ఏనాడు అడగనేలేదని సెలవిచ్చారు. కేవలం 5లక్షల కోట్లు ఇవ్వాలని మాత్రమే చంద్రబాబు అప్పట్లో కోరారని చెప్పుకొచ్చారు. అసలు హోదా అంశం టీడీపీకి సంబంధించింది కాదన్నారు. హోదా అంశం బీజేపీకి సంబంధించినదన్నారు. వెంకయ్యనాయుడు రెండు లక్షల 25వేల కోట్లు ఇస్తున్నామంటున్నారని కానీ వాటి వివరాలను మాత్రం చెప్పడం లేదన్నారు. కేంద్రం రెండు లక్షల 25 వేల కోట్లు ఇస్తే చంద్రబాబు వాటిని ఏం చేస్తున్నారో అన్న అనుమానం ప్రజల్లో కలిగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అదే సమయంలో బీజేపీతో గొడవ పెట్టుకుంటే లాభం ఉండదన్నారు. అందుకే దిక్కులేక కేంద్రం ఏమిచ్చినా తీసుకుంటున్నామన్నారు. ఇచ్చింది తీసుకుని ఫైట్ చేస్తామన్నారు గాలి ముద్దుకృష్ణమ నాయుడు. అయినా ఎన్నికల సమయంలో హోదా ఐదేళ్లు సరిపోదు 15 ఏళ్లు కావాలని తిరుపతి సభలోనే చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇప్పుడు గాలి మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పడం ఆసక్తిగా ఉంది.

Click on Image to Read:

pawan

kottapalli-geeta

alla-ramakrishna-reddy

chandrababu

c-ramachandraiah

sabbam-hari

chandrababu-courts

rajashekar-reddy-ysr

chandrababu-naidu-01

kvp-ramachandra-rao

pawan

pawan

pawan-interview

chandrababu-naidu-comments-on-political-carear

pawan-kalyan

chintakayala-chinna-rajappa

koratala-siva-vs-boyapati-srinu

First Published:  12 Sept 2016 9:41 AM IST
Next Story