డబ్బు, పోటీ చేసే స్థానాలపై ఇంటర్వ్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
ఒక తెలుగు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో 175 స్తానాలకు జనసేన పోటీ చేస్తుందా అని ప్రశ్నించగా… మరీ అంత మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తాను మాట్లడడం లేదన్నారు. ఎన్నిసీట్లలో పోటీ చేస్తానన్నది స్పష్టంగా చెప్పలేనన్నారు. ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి, పోటీ చేసే వారి ఆర్థిక స్తోమత మీద పోటీ చేసే సీట్ల సంఖ్య ఆధారపడి ఉంటుందన్నారు. పోటీ అయితే తప్పకుండా చేస్తామన్నారు. రాజకీయాల్లో డబ్బు […]
ఒక తెలుగు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో 175 స్తానాలకు జనసేన పోటీ చేస్తుందా అని ప్రశ్నించగా… మరీ అంత మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తాను మాట్లడడం లేదన్నారు. ఎన్నిసీట్లలో పోటీ చేస్తానన్నది స్పష్టంగా చెప్పలేనన్నారు. ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి, పోటీ చేసే వారి ఆర్థిక స్తోమత మీద పోటీ చేసే సీట్ల సంఖ్య ఆధారపడి ఉంటుందన్నారు. పోటీ అయితే తప్పకుండా చేస్తామన్నారు. రాజకీయాల్లో డబ్బు లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదన్నారు. విరాళాలు సేకరిస్తానని చెప్పారు. ఒక పారిశ్రామికవేత్త 200 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారట కదా అని ప్రశ్నించగా పవన్ సమాధానం సూటిగా చెప్పకుండా దాటవేశారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే డబ్బులు లేకుండా రాజకీయాలు నడపడం కష్టమేనన్నారు. ఎన్నికల ఖర్చు మొత్తాన్ని కూడా కోటి రెండు కోట్లకు పెంచాల్సిందిగా జనసేన తరపున ఈసీని కోరుతామని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవకాశవాద రాజకీయనాయకుల వల్ల పీఆర్పీ దెబ్బతినిందని… జనసేన విషయంలో జాగ్రత్తగా ఉంటామన్నారు. చచ్చిపోవడానికైనా సిద్దపడే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాజకీయ పార్టీలు తనను నలిపివేసే అవకాశం ఉందన్నారు. అన్నీ ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పార్టీని రూపునివ్వడం తనకు నెల రోజుల పనే అని అన్నారు. కానీ మొదట అందరిలో తాను నమ్మకం కలిగించిన తర్వాత మిగిలిన వారికి బాధ్యతలు అప్పగిస్తానన్నారు. తన వల్ల రాజకీయలు, వ్యవస్థ మొత్తం మారిపోతుందని తానుచెప్పడం లేదన్నారు. కానీ ప్రయత్నం చేస్తానని వెల్లడించారు.
Click on Image to Read: