కేసీఆర్ ఎర్రగడ్డలో ఉండాలి... వెంకయ్య యాచించే మనిషి!
కమ్యూనిస్టు నారాయణ మరోసారి పంచ్ డైలాగులు పేల్చారు. ఈసారి కేసీఆర్, వెంకయ్యలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాస్త కారంగానే ఉన్నా.. కసితీరా విమర్శించారు. కేసీఆర్ ఎర్రగడ్డలో ఉండాల్సిన మనిషని విమర్శించారు. నిజాం రాజును పొగుడుతారు, అదే నోటితో దొడ్డికొమురయ్య, చాకలి ఐలమ్మలను ప్రశంసిస్తారు. ఈయన నిజంగానే ఎర్రగడ్డలో ఉండాల్సిన మనిషి, అందుకే సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలనుకున్నారని ఎగతాళి చేశారు. తెలంగాణ పోరాటాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఉందంటూనే.. నిజాంపాలనను పొగడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్కసారి కూడా ప్రజల […]
BY sarvi11 Sept 2016 7:13 AM IST
X
sarvi Updated On: 12 Sept 2016 5:31 AM IST
కమ్యూనిస్టు నారాయణ మరోసారి పంచ్ డైలాగులు పేల్చారు. ఈసారి కేసీఆర్, వెంకయ్యలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాస్త కారంగానే ఉన్నా.. కసితీరా విమర్శించారు. కేసీఆర్ ఎర్రగడ్డలో ఉండాల్సిన మనిషని విమర్శించారు. నిజాం రాజును పొగుడుతారు, అదే నోటితో దొడ్డికొమురయ్య, చాకలి ఐలమ్మలను ప్రశంసిస్తారు. ఈయన నిజంగానే ఎర్రగడ్డలో ఉండాల్సిన మనిషి, అందుకే సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలనుకున్నారని ఎగతాళి చేశారు. తెలంగాణ పోరాటాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఉందంటూనే.. నిజాంపాలనను పొగడడం విడ్డూరంగా ఉందన్నారు.
ఒక్కసారి కూడా ప్రజల ఓట్లతో లోక్‌సభకు ఎన్నికవని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కమ్యూనిస్టులపై వెటకారాలు మానుకోవాలని హితవు పలికారు. యాచనతో రెండుసార్లు కర్ణాటక నుంచి మరోసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యి దొడ్డిదారిన కేంద్రమంత్రి అయ్యారని విమర్శించారు. కమ్యూనిస్టులు పార్లమెంటుకు ఎన్నికైనా కాకున్నా.. ఏనుగులాంటి వారన్నారు. ఏనుగు చనిపోయినా.. బతికినా వెయ్యి వరహాలేనని చెప్పారు. కమ్యూనిస్టులు పార్లమెంటులోపలున్నా.. బయట ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాటాలే మా అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు ప్రత్యేక హోదా పదేళ్లపాటు ఉండాలంటూ డిమాండ్ చేసిన వెంకయ్య ఇప్పుడు మాటమార్చడం తగదన్నారు. ఏపీ టీడీపీ సర్కారు కేంద్రంలో బీజేపీతో కలిసి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
Next Story