Telugu Global
Cinema & Entertainment

ఏం చైతూ ఇప్పటికైనా చెబుతావా...?

నాగచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారనే విషయం పబ్లిక్ సీక్రెట్ అయిపోయింది. వాళ్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అనే విషయంపై మాత్రమే మీడియా ఎదురుచూస్తోంది. మేమిద్దరం ప్రేమలో ఉన్నామనే విషయాన్ని సమంత ఎప్పుడో ఇండైరెక్ట్ గా లీకులిచ్చేసింది. నిజానికి మీడియాకు ఈ మేటర్ తెలియడానికి కారణం కూడా సమంతానే. తాజాగా ఈ విషయాన్ని నాగార్జున కూడా ఒప్పుకున్నాడు. చైతన్యకు ఇష్టమైన అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తామంటున్నాడు. మీ అందరికీ తెలిసిందే కదా.. ఆ అమ్మాయి పేరు సమంత అంటూ నాగార్జున ఓపెన్ అయిపోయాడు. […]

ఏం చైతూ ఇప్పటికైనా చెబుతావా...?
X

నాగచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారనే విషయం పబ్లిక్ సీక్రెట్ అయిపోయింది. వాళ్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అనే విషయంపై మాత్రమే మీడియా ఎదురుచూస్తోంది. మేమిద్దరం ప్రేమలో ఉన్నామనే విషయాన్ని సమంత ఎప్పుడో ఇండైరెక్ట్ గా లీకులిచ్చేసింది. నిజానికి మీడియాకు ఈ మేటర్ తెలియడానికి కారణం కూడా సమంతానే. తాజాగా ఈ విషయాన్ని నాగార్జున కూడా ఒప్పుకున్నాడు. చైతన్యకు ఇష్టమైన అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తామంటున్నాడు. మీ అందరికీ తెలిసిందే కదా.. ఆ అమ్మాయి పేరు సమంత అంటూ నాగార్జున ఓపెన్ అయిపోయాడు. అయితే ఇంత జరుగుతున్నా నాగచైతన్య మాత్రం ఇప్పటివరకు తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టలేదు. చివరికి నాగార్జున ఒప్పుకున్నా సరే చైతూ మాత్రం లవ్ మేటర్ లో నోరు మెదపడం లేదు. అసలు లవ్ ఎపైర్ గురించి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందుకే రావడం మానేశాడు నాగచైతన్య. త్వరలోనే ప్రేమమ్ విడుదల ఉంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈనెల 20న ఉంది. సినిమాను వచ్చేనెల 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగానైనా మీడియా ముందుకు రావాల్సిందే. కనీసం అప్పుడైనా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెడతాడేమో చూడాలి.

First Published:  10 Sept 2016 4:13 AM IST
Next Story