కోడెలను ఫైల్‌తో కొట్టిన ఎమ్మెల్యే
ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. హోదా అంశంపై చర్చకు ప్రతిపక్షం పట్టుబట్టడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వైసీపీ ఎమ్మల్యేలు స్పీకర్ పోడియం వద్ద బల్లలు ఎక్కి ఆందోళన చేశారు. హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చర్చకు ప్రభుత్వంఅంగీకరించపోవడంతో కాగితాలు చించి స్పీకర్ మీదకు విసిరారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ వాయిదా ప్రకటన చేయగానే ఆయన మీదకు ఒక ఫైల్ వచ్చి పడింది. ఫైల్ స్పీకర్‌ను […]

ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. హోదా అంశంపై చర్చకు ప్రతిపక్షం పట్టుబట్టడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వైసీపీ ఎమ్మల్యేలు స్పీకర్ పోడియం వద్ద బల్లలు ఎక్కి ఆందోళన చేశారు. హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చర్చకు ప్రభుత్వంఅంగీకరించపోవడంతో కాగితాలు చించి స్పీకర్ మీదకు విసిరారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ వాయిదా ప్రకటన చేయగానే ఆయన మీదకు ఒక ఫైల్ వచ్చి పడింది. ఫైల్ స్పీకర్‌ను నేరుగా తాకింది. కోడెల కడుపు కిందభాగంపై ఫైల్ వచ్చి పడింది. దీంతో సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Click on Image to Read: