మెగా ఫ్యామిలీకి, మంత్రి అయ్యన్న కుటుంబానికి కక్షలున్నాయా?
పవన్ కల్యాణ్‌ను ఎవరూ ఏమీ అనవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినప్పటికీ సీనియర్ నేత, మంత్రి అయన్నపాత్రుడు మాత్రం విరుచుకుపడ్డారు. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలని… అలా చేస్తే తిరిగి దగ్గరుండి తాను గెలిపించుకుంటానని పవన్ కల్యాణ్ కాకినాడ మీటింగ్‌లో చెప్పడంపై అయన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్పీ నాటి సంగతులు గుర్తు చేశారు. ”అనకాపల్లిలో నీ బావ అల్లు అరవింద్ పోటీ చేస్తే నీవు, నీ అన్న […]
పవన్ కల్యాణ్‌ను ఎవరూ ఏమీ అనవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినప్పటికీ సీనియర్ నేత, మంత్రి అయన్నపాత్రుడు మాత్రం విరుచుకుపడ్డారు. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలని… అలా చేస్తే తిరిగి దగ్గరుండి తాను గెలిపించుకుంటానని పవన్ కల్యాణ్ కాకినాడ మీటింగ్‌లో చెప్పడంపై అయన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్పీ నాటి సంగతులు గుర్తు చేశారు. ”అనకాపల్లిలో నీ బావ అల్లు అరవింద్ పోటీ చేస్తే నీవు, నీ అన్న ఎందుకు గెలిపించుకోలేకపోయారు” అని ప్రశ్నించారు.
అప్పటికే పెద్ద హీరోలు అయి ఉండి కూడా ఇద్దరూ కలిసి అల్లు అరవింద్‌ను గెలిపించుకోలేకపోయారని ఇప్పుడు మాత్రం అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే తిరిగి గెలిపిస్తావా అని పవన్‌ను చింతకాయల అయన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఎంపీలను గెలిపించే సత్తా ఉంటే అప్పుడే అల్లు అరవింద్‌ను గెలిపించుకోవాల్సిందన్నారు. మెగా ఫ్యామిలీ అంటే అయన్నపాత్రుడి కుటుంబానికి కూడా బాగా కోపం ఉన్నట్టుంది. చిరంజీవిని ఉద్దేశించి ఒక మీటింగ్‌లో అయన్నపాత్రుడు కుమారుడు కూడా చాలా దారుణంగా దూషించారు. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ”చిరంజీవి అనే వ్యక్తిని నమ్మి 80 లక్షల మంది ఓట్లేస్తే.. వాడు ఎప్పుడైనా వారి దగ్గరకు వెళ్లి పార్టీని తాకట్టు పెడుతున్నా అని చెప్పాడా” అంటూ సదరు మీటింగ్‌లో అయ్యన్నకుమారుడు మాట్లాడాడు. పార్టీని సోనియా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని దూషించాడు. ఇప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు స్పందించకపోయినా అయన్నపాత్రుడు మాత్రం నేరుగా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం బట్టి మెగా ఫ్యామిలీ అంటే మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబానికే కసి ఉన్నట్టుగా ఉంది.
Click on Image to Read: