మళ్లీ దొరికిపోయిన చంద్రబాబు
చంద్రబాబు శాసనమండలి వాయిదా పడిన తర్వాత విలేకర్ల వద్ద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవే హైదరాబాద్‌లో ఆఖరి సమావేశాలు కావొచ్చని చెప్పారు. హైదరాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ది చేశానని చెప్పారు. ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా సలహా ఇచ్చింది తానేనన్నారు. జయకృష్ణ అప్పుడప్పుడు తన దగ్గరకు వస్తుండేవాడన్నారు. అప్పుడే తాను ఎన్టీఆర్‌ను కలవాలనుకున్నానని చెప్పారు. అనురాగదేవత షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌ను కలిశానని అప్పుడే రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఎన్టీఆర్‌కు సలహా ఇచ్చానన్నారు. 23ఏళ్లకే ఎమ్మెల్సీ […]
చంద్రబాబు శాసనమండలి వాయిదా పడిన తర్వాత విలేకర్ల వద్ద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవే హైదరాబాద్‌లో ఆఖరి సమావేశాలు కావొచ్చని చెప్పారు. హైదరాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ది చేశానని చెప్పారు. ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా సలహా ఇచ్చింది తానేనన్నారు. జయకృష్ణ అప్పుడప్పుడు తన దగ్గరకు వస్తుండేవాడన్నారు. అప్పుడే తాను ఎన్టీఆర్‌ను కలవాలనుకున్నానని చెప్పారు. అనురాగదేవత షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌ను కలిశానని అప్పుడే రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఎన్టీఆర్‌కు సలహా ఇచ్చానన్నారు. 23ఏళ్లకే ఎమ్మెల్సీ అయ్యేందుకు ప్రయత్నించానని చెప్పారు. ఒంగోలు గిత్తలను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నించానన్నారు.
అనంతపురం జిల్లా ఇకపై కరువు రహిత జిల్లా అని ప్రకటించారు. హోదా వస్తే ఏటా రూ. 60వేల కోట్లు వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 60వేలకోట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఎలా వస్తాయో తనకు చెప్పి గైడ్ చేయాలని విపక్షాలను కోరారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్ పోడియం వద్దకు కూడా వెళ్లేవారం కాదన్నారు. అయితే చంద్రబాబు చెప్పిన దాంట్లో తేడా ఎక్కడ ఉందంటే… 23 ఏళ్లకే ఎమ్మెల్సీ అవడం అసాధ్యం. ఎమ్మెల్సీ కావాలంటే కనీసం 30ఏళ్ల వయసుండాలి. మరి ఆయన 23 ఏళ్లకే ఎలా ఎమ్మెల్సీ కావాలనుకున్నారో?. ఇక ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా తానే సలహా ఇచ్చానన్న చంద్రబాబు… 1983 ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్‌కు గెలిచే సీన్ లేదని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పై తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఏంటో ఈ మధ్య చంద్రబాబు ఇలా లాజిక్ లేని విషయాలు చెబుతూ పదేపదే దొరికిపోతున్నారు. 2018లోనే అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానని ఆశ్చర్యపరిచారు. సింధుకు మెడల్ రావడానికి కారణం తానేన్నారు.
Click on Image to Read: