ప్యాకేజ్‌ను పాచిపోయిన లడ్డూలతో పోలుస్తారా?
కాకినాడ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీఎల్పీ సమావేశంలో స్పందించారు. ఆచితూచి మాట్లాడారు. ప్యాకేజ్‌ను పాచిపోయిన లడ్డూలతో పోల్చడం సబబుగా లేదని నేతల వద్ద అన్నారు. పవన్ కల్యాణ్ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనన్నారు. పవన్ ఏం మాట్లాడినా తమ ఇబ్బందులు తమకు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. పవన్‌పై ఎలాంటివ్యాఖ్యలు చేయవద్దని నేతలకు సూచించారు. ఇచ్చిన ప్యాకేజ్‌ను వద్దని ఎలా చెప్పగలమని చంద్రబాబు ప్రశ్నించారు. అంతే కాదు ప్రత్యేకహోదా సాధించే ఫార్ములా ఏదైనా ఉంటే చెబితే దాన్ని […]

కాకినాడ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీఎల్పీ సమావేశంలో స్పందించారు. ఆచితూచి మాట్లాడారు. ప్యాకేజ్‌ను పాచిపోయిన లడ్డూలతో పోల్చడం సబబుగా లేదని నేతల వద్ద అన్నారు. పవన్ కల్యాణ్ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనన్నారు. పవన్ ఏం మాట్లాడినా తమ ఇబ్బందులు తమకు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. పవన్‌పై ఎలాంటివ్యాఖ్యలు చేయవద్దని నేతలకు సూచించారు. ఇచ్చిన ప్యాకేజ్‌ను వద్దని ఎలా చెప్పగలమని చంద్రబాబు ప్రశ్నించారు. అంతే కాదు ప్రత్యేకహోదా సాధించే ఫార్ములా ఏదైనా ఉంటే చెబితే దాన్ని ఫాలో అవుతాం కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు టీడీపీ అనుకూల మీడియా వెల్లడించింది. జగన్‌పైనా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి ప్రతిపక్ష నేతను చూడలేదని టీడీఎల్పీలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Click on Image to Read: