అసెంబ్లీని తాకిన హోదా సెగ... మైక్ కట్, ఎదురుదాడి
ప్రత్యేకహోదా అంశం ఏపీ అసెంబ్లీని తాకింది. హోదా ఇవ్వడం లేదని అరుణ్ జైట్లీ స్పష్టం చేయడం, ప్యాకేజ్‌ను చంద్రబాబు ఆహ్వానించడంపై వైసీపీ సభ్యులు సభను స్తంభింపచేశారు. హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వెంటనే హోదా అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే హోదాపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని…అంతవరకు హోదాపై ఎవరూ మాట్లాడేందుకు వీలులేదని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఈ సమయంలో మైక్ తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, అచ్చెన్నాయుడు ఎదురుదాడి […]
ప్రత్యేకహోదా అంశం ఏపీ అసెంబ్లీని తాకింది. హోదా ఇవ్వడం లేదని అరుణ్ జైట్లీ స్పష్టం చేయడం, ప్యాకేజ్‌ను చంద్రబాబు ఆహ్వానించడంపై వైసీపీ సభ్యులు సభను స్తంభింపచేశారు. హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వెంటనే హోదా అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే హోదాపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని…అంతవరకు హోదాపై ఎవరూ మాట్లాడేందుకు వీలులేదని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఈ సమయంలో మైక్ తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, అచ్చెన్నాయుడు ఎదురుదాడి చేశారు. హోదాపై వైసీపీకి చిత్తశుద్ది లేదని బోండా విమర్శించారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే ప్రధాని ఇంటి ముందు జగన్ ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. ఈ సమయంలో జగన్‌కు స్పీకర్ మైక్ ఇచ్చారు. ఇదే సభలో రెండు సార్లు హోదా కోసం తీర్మానం చేసి పంపామని జగన్ గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు హోదా ఇవ్వబోమని అరుణ్ జైట్లీ చెబితే దాన్ని చంద్రబాబు ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు. జగన్ రెండు మాటలు మాట్లాడగానే మైక్ కట్ చేశారు స్పీకర్. మరోసారి జోక్యం చేసుకున్న యనమల … తాము స్టేట్‌మెంట్ ఇచ్చేవరకు హోదా అంశంపై సభలో మాట్లాడేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఓ దశలో స్పీకర్ కూడా వైసీపీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ”మీరు(జగన్) మాట్లాడినప్పుడు మాత్రమే మీ వాళ్లు కూర్చుంటున్నారు. మరెవరినీ మాట్లాడనివ్వడం లేదు. అసెంబ్లీ సిబ్బందిని కూడా పనిచేయనివడం లేదు”. అని అన్నారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు శాంతించలేదు. దీంతో సభను పది నిమిషాల పాటుస్పీకర్ వాయిదా వేశారు.
Click on Image to Read: