కమ్యూనిస్టులతోనూ మాట్లాడాం " జగన్
ప్రత్యేకహోదా ఇవ్వకపోవడాన్ని, ప్యాకేజ్‌ను చంద్రబాబు ఆహ్వానించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది. శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్టు జగన్ ప్రకటించారు. ప్యాకేజ్‌ను ఆహ్వానిస్తూ చంద్రబాబు చేసిన ప్రకటన వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తెస్తామన్నారు. చంద్రబాబుపై ఒత్తిడి పెరిగేలా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు దగ్గరుండి కేంద్ర ప్రభుత్వం చేత ఏపీ ప్రజల చెవిలో క్యాబేజ్ పెట్టించారని జగన్ విమర్శించారు. కేంద్రం నుంచి వైదొలుగుతామని చంద్రబాబు చెప్పినప్పుడే ప్రత్యేక […]
ప్రత్యేకహోదా ఇవ్వకపోవడాన్ని, ప్యాకేజ్‌ను చంద్రబాబు ఆహ్వానించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది. శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్టు జగన్ ప్రకటించారు. ప్యాకేజ్‌ను ఆహ్వానిస్తూ చంద్రబాబు చేసిన ప్రకటన వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తెస్తామన్నారు. చంద్రబాబుపై ఒత్తిడి పెరిగేలా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు దగ్గరుండి కేంద్ర ప్రభుత్వం చేత ఏపీ ప్రజల చెవిలో క్యాబేజ్ పెట్టించారని జగన్ విమర్శించారు. కేంద్రం నుంచి వైదొలుగుతామని చంద్రబాబు చెప్పినప్పుడే ప్రత్యేక హోదాపై కేంద్రం దిగివస్తుందన్నారు. అలా చంద్రబాబుపై ఒత్తిడి పెరిగే వరకు పోరాడుతామన్నారు.
అరుణ్ జైట్లీ, చంద్రబాబు కలిసి ఏపీ యువత ఆశలకు సమాధి కట్టారని ఆరోపించారు. హోదా సాధనలో విఫలమైన చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్‌ను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరని జగన్ ప్రశ్నించారు. ఇదేమైనా చంద్రబాబు సొంత వ్యవహారమా అని నిలదీశారు. శనివారం జరిగే బంద్‌లో అన్ని పార్టీలు పాల్గొనాలన్నారు. ఉదయమే కమ్యూనిస్టు నేతలతోనూ మాట్లాడామని అందరం కలిసి బంద్ చేస్తామన్నారు. ఒంటిరిగా కాకుండా కమ్యూనిస్టులను కూడా కలుపుకుని వెళ్తామని వైసీపీ నిర్ణయించుకోవడం… ఆ విషయాన్ని జగనే స్వయంగా చెప్పడం బట్టి కమ్యూనిస్టులతో కలిసి పనిచేసేందుకు వైసీపీ సిద్దమవుతున్నట్టుగా ఉంది.
Click on Image to Read: