విక్రమ్ ప్రయోగం ఈ సారి వమ్ము కాలేదు...!
సౌత్ ఇండియాలో కమల్ హాసన్ తరువాత ఇప్పుడున్న హీరోల్లో ఈస్దాయి ప్రయోగాలు.. యాక్టింగ్ చేయగల కొద్ది మంది నటుల్లో విక్రమ్ ఒకరని చె్ప్పాలి. సేతు..శివపుత్రుడు.. అపరిచితుడు..నాన్న చిత్రాలు ఆయన కెరీర్ లోమైల్ స్టోన్స్ గా నిలిచాయి. అయితే ఎన్నో ఆశలు..అంచనాలు పెట్టుకుని శంకర్ డైరెక్షన్లో చేసిన ఐ చిత్రం మాత్రం ఘోరంగా నిరాశ పరిచింది. కట్ చేస్తే..తాజాగా ఆనంద్ శంకర్ అనే కొత్త దర్శకుడితో చేసిన ఇంకొక్కడు చిత్రం గురువారం తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈసినిమా యాక్షన్ […]
సౌత్ ఇండియాలో కమల్ హాసన్ తరువాత ఇప్పుడున్న హీరోల్లో ఈస్దాయి ప్రయోగాలు.. యాక్టింగ్ చేయగల కొద్ది మంది నటుల్లో విక్రమ్ ఒకరని చె్ప్పాలి. సేతు..శివపుత్రుడు.. అపరిచితుడు..నాన్న చిత్రాలు ఆయన కెరీర్ లోమైల్ స్టోన్స్ గా నిలిచాయి. అయితే ఎన్నో ఆశలు..అంచనాలు పెట్టుకుని శంకర్ డైరెక్షన్లో చేసిన ఐ చిత్రం మాత్రం ఘోరంగా నిరాశ పరిచింది.
కట్ చేస్తే..తాజాగా ఆనంద్ శంకర్ అనే కొత్త దర్శకుడితో చేసిన ఇంకొక్కడు చిత్రం గురువారం తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈసినిమా యాక్షన్ , సైన్స్ ఫిక్షన్ అంశాలు కలగలిపి కథను అల్లుకున్నాడు. విక్రమ్.. ద్వపాత్రాభినయం చేశాడు. ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మరొకటి థర్డ్ జండర్ రోల్ లో లవ్ అనే సైంటిస్ట్ రోల్. ఒక రోల్ విలన్..మరొకటి హీరో అన్నమాట. రెండు రోల్స్ లోను విక్రమ్ మెప్పించాడు. నయనతార రోల్ కూడా సినిమాకు చాలా బలం చేకూర్చింది. ఓవరాల్ గా చూసినప్పుడు సినిమా పరవాలేదనిపిస్తుంది. కానీ.. స్క్రీన్ ప్లే పరంగా చూసినప్పుడు దర్శకుడు ఒక కొత్త పాయింట్ ను ఓల్డ్ ఫార్మేట్ లో చెప్పాడానికి ప్రయత్నం చేశాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు మ్యాడ్ మ్యాక్.. సెవన్త్ సెన్స్..రోబో వంటి చిత్రాలు కొందరికి గుర్తుకు వస్తుంటాయి. కథనం లో దర్శకుడు ఇంకాస్త వర్కవుట్ చేసి వుంటే.. ఇంకొక్కడు చిత్రం విక్రమ్ కు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుండేదనడంలో ఏ మాత్రం సందేహాం లేదు .