పాతగూటికి మాగంటి? రేవంత్ మాటల్లో ఆంతర్యమేంటి?
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మళ్లీ సైకెలెక్కుతారా? ఈ మాటను పదే పదే రేవంత్ రెడ్డి ప్రస్తావించడం వెనక ఆంతర్యం ఏంటి? ఆయన తిరిగి సైకిలెక్కుతారన్న ప్రచారం తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది. దీనికి రేవంత్ రెడ్డి మాటలు ఊతమిచ్చేలా ఉన్నాయి. తెలుగుదేశం నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన మాగంటి గోపీనాథ్ అక్కడ ఇమడలేకపోతున్నారని, ఈ విషయాన్ని తనను రహస్యంగా కలిసినపుడు చెప్పాడని వెల్లడించారు. పైగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మంచి పనులు చేస్తోందని అభినందిస్తున్నారని చెప్పారు. మాగంటి […]
BY sarvi8 Sept 2016 3:38 AM IST
X
sarvi Updated On: 8 Sept 2016 4:51 AM IST
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మళ్లీ సైకెలెక్కుతారా? ఈ మాటను పదే పదే రేవంత్ రెడ్డి ప్రస్తావించడం వెనక ఆంతర్యం ఏంటి? ఆయన తిరిగి సైకిలెక్కుతారన్న ప్రచారం తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది. దీనికి రేవంత్ రెడ్డి మాటలు ఊతమిచ్చేలా ఉన్నాయి. తెలుగుదేశం నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన మాగంటి గోపీనాథ్ అక్కడ ఇమడలేకపోతున్నారని, ఈ విషయాన్ని తనను రహస్యంగా కలిసినపుడు చెప్పాడని వెల్లడించారు. పైగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మంచి పనులు చేస్తోందని అభినందిస్తున్నారని చెప్పారు. మాగంటి విషయాన్ని మీడియా ముందు రేవంత్ రెడ్డి ప్రస్తావించడం ఇదే మొదటి సారి కాదు. ఆగస్టు 21న మాగంటి గోపీనాథ్ కుడిభుజంగా చెప్పుకునే ప్రదీప్ టీఆర్ ఎస్ నుంచి తిరిగి తెలుగుదేశంలో చేరారు. అప్పటి నుంచే మాగంటి గోపీనాథ్ తిరిగి పాతగూటికి చేరతారన్న ప్రచారం మొదలైంది.
తాజాగా మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డి టీఆర్ ఎస్ నుంచి తిరిగి తెలుగుదేశంలో చేరిన సందర్భంగా రేవంత్ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా గులాబీపార్టీలో చేరిన తెలుగుదేశం నేతలెవరూ ఆ పార్టీలో ఉండలేకపోతున్నారని అన్నారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ సైకిల్ గూటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రేవంత్, మాగంటి ఇద్దరూ ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నవారే కావడం గమనార్హం. ఓటుకునోటుకేసులో ఎమ్మెల్యేల కోనుగోలుకు డబ్బులు సమకూర్చాడని మాగంటిపైనా ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఆయన్ని ఏక్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్న వార్తలు మీడియాలో కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ అధికార పార్టీలో చేరడం, కేసు విచారణ కూడా దాదాపుగా నిలిచిపోవడం చకాచకా జరిగిపోయాయి. కానీ వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్ తో ఈ కేసు మళ్లీ పునర్విచారణకు వచ్చింది. ఈ సమయంలో మాగంటిపై రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్.. అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మరో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్టీలోకి వస్తాడని మీడియా ముందు పదేపదే చెప్పడం వెనక ఏదో ఆంతర్యం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story