బోయపాటి ఒక దొంగనా? ముదురుతున్న వివాదం
బోయపాటి శీను సినిమా తీస్తే హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ కంటే ఈయనదే ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఇది పలాన హీరో సినిమా అనే కంటే ఇది బోయపాటి సినిమా అని అనుకునే రేంజ్లో హడావుడి చేస్తుంటారు. కొద్దికాలం క్రితం ఒక మూవీ ఫంక్షన్‌లో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ గురించి బోయపాటి చేసిన వ్యాఖ్యలు రచ్చరేపాయి. నాణ్యమైన సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ నుంచి తాను బలవంతంగా రాబట్టుకున్నానని బోయపాటి వేదికపై చెప్పారు. దీంతో అక్కడే ఉన్న దేవి అభ్యంతరం వ్యక్తం […]
బోయపాటి శీను సినిమా తీస్తే హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ కంటే ఈయనదే ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఇది పలాన హీరో సినిమా అనే కంటే ఇది బోయపాటి సినిమా అని అనుకునే రేంజ్లో హడావుడి చేస్తుంటారు. కొద్దికాలం క్రితం ఒక మూవీ ఫంక్షన్‌లో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ గురించి బోయపాటి చేసిన వ్యాఖ్యలు రచ్చరేపాయి. నాణ్యమైన సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ నుంచి తాను బలవంతంగా రాబట్టుకున్నానని బోయపాటి వేదికపై చెప్పారు. దీంతో అక్కడే ఉన్న దేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను అన్ని సినిమాలకు ఓకేలా పనిచేస్తానని… ఎవరితోనో చెప్పించుకునేంత స్థాయికి దిగజారనని సీరియస్‌గా గట్టి కౌంటర్ ఇచ్చారు. తాజాగా బోయపాటి శీను ఇతరుల క్రెడిట్‌ను కూడా తనదిగా చెప్పుకుని తిరుగుతుంటారన్నట్టుగా మరో ఉదంతం ఆయన్ను ఇబ్బంది పెడుతోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివయే ఆ విషయాన్ని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో బోయపాటి, కొరటాల మధ్య వివాదం రేగింది.
బోయపాటి శీను తీసిన సింహా సినిమాకు సంబందించిన కథ, మాటలు తనవేనని కొరటాల శివ ఇంటర్వ్యూలో చెప్పారు. కథ, మాటలు రెండూ తానే రాశానని బోయపాటి మాత్రం తెరపై కథ లేదా మాటలు ఏదో ఒక దానికి మాత్రమే తన పేరు వేస్తానని చెప్పారని శివ చెప్పారు. దాంతో తనకు చాలా బాధేసిందన్నారు. అందుకే రెండింటిలో దేనికీ తన పేరు అవసరం లేదని చెప్పానన్నారు. తాను కోపంతో ఆ మాట చెబితే హమ్మయ్య ఇంతే చాలు అన్నట్టు నిజంగానే స్ర్కీన్ మీద తన పేరు లేకుండా చేశారని ఇంటర్వ్యూలో కొరటాల శివ చెప్పారు. దీంతో చిత్రపరిశ్రమలో బోయపాటి గిల్టీగా ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది. కొరటాల శివ చేసిన వ్యాఖ్యలు బోయపాటి వరకు వెళ్లాయంటున్నారు. ఈ వ్యవహారం ఇంకా చాలా దూరం వెళ్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద కొరటాల వ్యాఖ్యలు బోయపాటి శీనుపై మచ్చలాగే మిగిలిపోతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కొరటాల శివ చెప్పిందే నిజమైతే… ఒకరు కష్టపడి రాసిన కథ, మాటలను సొంతం చేసుకోవడం సిగ్గుచేటు అని చెప్పారు.
Click on Image to Read: