Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వినాయక్

చిరంజీవి నటిస్తున్నమోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఖైదీనంబర్-150… సంక్రాంతిక కానుకగా వస్తుందనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. కానీ ఆ విషయాన్ని మేకర్స్ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. సినిమా షెడ్యూల్స్ కొన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎనౌన్స్ చేద్దాం అనుకున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ సాఫీగా జరుగుతున్న కారణంగా… ఖైదీ నంబర్-150 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా… భోగి రోజున.. అంటే జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు వీవీ వినాయక్ […]

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వినాయక్
X

చిరంజీవి నటిస్తున్నమోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఖైదీనంబర్-150… సంక్రాంతిక కానుకగా వస్తుందనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. కానీ ఆ విషయాన్ని మేకర్స్ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. సినిమా షెడ్యూల్స్ కొన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎనౌన్స్ చేద్దాం అనుకున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ సాఫీగా జరుగుతున్న కారణంగా… ఖైదీ నంబర్-150 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా… భోగి రోజున.. అంటే జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు వీవీ వినాయక్ ప్రకటించాడు. రాజమండ్రి పుష్కర ఘాట్ లో ఉన్న విద్యా గణపతి ఆలయాన్ని సందర్శించిన వినాయక్… మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టంచేశాడు. ప్రస్తుతం చిరు సినిమాకు సంబంధించి కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ షెడ్యూల్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే… రామోజీ ఫిలింసిటీకి షిఫ్ట్ అవుతాడు చిరంజీవి. అక్కడ ఐటెంసాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. ఆ భారీ సెట్ లో చిరంజీవి-క్యాథరీన్ మద్య ఓ ఐటెసాంగ్ ను పిక్చరైజ్ చేస్తారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ ను అక్టోబర్ చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది.

First Published:  8 Sept 2016 3:10 AM IST
Next Story