అలా చేసి ఉంటే నన్ను ఓడించే శక్తే దేశంలో ఉండేది కాదు- చంద్రబాబు
ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లీలో కాకుండా శాసనమండలిలో చంద్రబాబు ప్రకటన చేశారు. సుధీర్ఘంగా ప్రసగించారు. హోదాకు సమానమైన ప్రయోజనాలను చేకూరుస్తామని కేంద్రం చెప్పిందన్నారు.ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఒక విధంగా చూస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి కేంద్రం ఇచ్చింది తీసుకోవడమే మేలన్నారు. ఇచ్చింది తీసుకుని మరింత అడుగుతామన్నారు. అలా కాకుండా ఏదో చేస్తే ఇంకా నష్టపోతామన్నారు. తన జీవితంలో రాజీ అన్నదే లేదని చంద్రబాబు చెప్పారు. తనకు ప్రతిపక్షం అన్నదే […]
ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లీలో కాకుండా శాసనమండలిలో చంద్రబాబు ప్రకటన చేశారు. సుధీర్ఘంగా ప్రసగించారు. హోదాకు సమానమైన ప్రయోజనాలను చేకూరుస్తామని కేంద్రం చెప్పిందన్నారు.ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఒక విధంగా చూస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి కేంద్రం ఇచ్చింది తీసుకోవడమే మేలన్నారు. ఇచ్చింది తీసుకుని మరింత అడుగుతామన్నారు. అలా కాకుండా ఏదో చేస్తే ఇంకా నష్టపోతామన్నారు. తన జీవితంలో రాజీ అన్నదే లేదని చంద్రబాబు చెప్పారు. తనకు ప్రతిపక్షం అన్నదే లేదన్నారు. గతంలోనూ తాను ఓడిపోయానంటే కారణం అప్పుడు తాను చేసిన పనుల వల్లేనన్నారు. కాస్త ముందుజాగ్రత్త పడి ఉంటే అప్పుడు కూడా ఓడిపోయేవాడిని కాదన్నారు. తనను ఓడించే శక్తి దేశంలోనే లేదన్నారు చంద్రబాబు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తిగానే ఉన్నాయి. అప్పుడే ముందుజాగ్రత్తగా చేసి ఉంటే దేశంలోనే తనను ఓడించే శక్తి ఉండేది కాదన్నారు. మరి ఆ ముందు జాగ్రత్త చర్యలు ఏంటో?.
Click on Image to Read: