ఓటేసిన విశాఖ..! విన్నావా మీ ఎంపీలు ఏమన్నారో!
ఏపీకి రైల్వే జోన్ వస్తే అది విశాఖకే అని ప్రతి ఒక్కరు భావించారు. మరో ఆలోచన ఎవరికి రాలేదు. కానీ మిగిలిన జిల్లాలన్నింటికీ పంగనామాలు పెడుతూ అన్ని సంస్థలను అమరావతిలో కుప్పేసుకుంటున్న చంద్రబాబు… ఇప్పుడు విశాఖ రైల్వే జోన్‌పైనా కన్నేశారు. విజయవాడకు రైల్వే జోన్ ను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. అనుకూల పత్రికల్లోనూ లీకులిచ్చారు. ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు ఉత్తరాంధ్రలో పుట్టిన ఎవడికైనా కోపం కట్టలు తెంచుకోవడం కామన్. కానీ ఉత్తరాంధ్ర జనం ఓటేసిన ఎంపీలకు మాత్రం […]
ఏపీకి రైల్వే జోన్ వస్తే అది విశాఖకే అని ప్రతి ఒక్కరు భావించారు. మరో ఆలోచన ఎవరికి రాలేదు. కానీ మిగిలిన జిల్లాలన్నింటికీ పంగనామాలు పెడుతూ అన్ని సంస్థలను అమరావతిలో కుప్పేసుకుంటున్న చంద్రబాబు… ఇప్పుడు విశాఖ రైల్వే జోన్‌పైనా కన్నేశారు. విజయవాడకు రైల్వే జోన్ ను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. అనుకూల పత్రికల్లోనూ లీకులిచ్చారు. ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు ఉత్తరాంధ్రలో పుట్టిన ఎవడికైనా కోపం కట్టలు తెంచుకోవడం కామన్. కానీ ఉత్తరాంధ్ర జనం ఓటేసిన ఎంపీలకు మాత్రం కోపం రాలేదు సరికదా… బాబు ప్రేమే మా ప్రమే అన్నట్టుగా విజయవాడకు వంతపాడారు. ఇది చాలా ఆశ్చర్యమే అయినా నిజం. ముందుగా మీడియాతో మాట్లాడిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్…ఉత్తరాంధ్ర మీడియా ప్రతినిధులకే చిర్రెత్తుకొచ్చేలా సమాధానం ఇచ్చారు.
”డెలివరి కోసం ఆస్పత్రికి వెళ్తాం. డెలివరి అయిన తర్వాతే మాట్లాడుదాం. విజయవాడ మన రాష్ట్రం కాదా?. నన్ను అడిగితే అనకాపల్లి అంటా, మరొకరు విశాఖ అంటారు. అంతా మన రాష్ట్రమే కదా” అని వ్యాఖ్యానించారు అవంతి. ఈ సమాధానం విని విలేకర్లకే కోపం వచ్చింది. విశాఖకు జోన్ రాకుండా విజయవాడకు తరలిస్తే చూస్తూ ఊరుకుంటారా అని విలేకర్లు గట్టిగా ప్రశ్నించే సరికి లేదు లేదు విశాఖకే రావాలంటూ జారుకున్నారు. ఇక విశాఖ ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు, చంద్రబాబుకు సన్నిహితుడు అని ముద్ర ఉన్న హరిబాబు కూడా విశాఖ రైల్వే జోన్ అంశాన్ని బలహీనపరిచేలా వ్యాఖ్యానించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైల్వే జోన్ విశాఖకే తెస్తామని ధైర్యం చెప్పాల్సిన హరిబాబు… ”ఆంధ్రప్రదేశ్‌కు జోన్ రావాలనుకుంటున్నాం. విశాఖ కావాలని అడిగాం. ఒకవేళ విజయవాడకు జోన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ గెలిచినట్టు, విశాఖ ఓడినట్టు” అని వెళ్లిపోయారు.
ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న విశాఖ రైల్వే జోన్ అంశాన్ని విశాఖ ఎంపీ మరీ ఇంత లైట్‌గా ఏపీ గెలిచినట్టు, విశాఖ ఓడినట్టు అని చెప్పి వెళ్లిపోవడం ఆశ్చర్యమే. ఒకరు గెలవడం, ఒకరు ఓడడం ఆటలో కామనే. కానీ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు జోన్ కోసం పోరాడుతుంటే వారిని గెలిపించే బాధ్యత వారి ఓట్లతో గెలిచిన హరిబాబుకు లేదా?. మొత్తం మీద విశాఖ జిల్లా ఇద్దరు ఎంపీల తీరు చూస్తుంటే వారే దగ్గరుండి విశాఖకు కాకుండా విజయవాడకు రైల్వేజోన్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఉంది. ఇందుకే కాబోలు హరిబాబు.. చంద్రబాబు మనిషి అని విమర్శలు చేసేది.
Click on Image to Read: