అత్త, మరదళ్లపై లైంగిక వేధింపులు... భర్తను నరికి చంపిన భార్య
పిల్లనిచ్చారు.. ఉద్యోగమిచ్చారు.. ఇల్లరికం తెచ్చుకున్నారు.. ఇంటి పెత్తనమిచ్చారు.. కానీ ఆ పశువు మాత్రం పిల్లనిచ్చిన అత్తను, మరదళ్లను చెరపట్టాలని చూశాడు. అడ్డొచ్చిన వారిని చంపేస్తానని బెదిరించాడు. భర్త అకృత్యాలను భరించలేని భార్య అతడిని నరికి చంపిన ఘటన వరంగల్ జిల్లా భూపాలపల్లి పరిధిలో జరిగింది. జంగేడుకు చెందిన రేనుకుంట్ల నర్సయ్య, నిర్మల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. నర్సయ్య 2012లో అనారోగ్యంతో చనిపోయాడు. నిర్మల తన పెద్దకూతురు అనూషకు పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన పెండెల నాగరాజు(28)తో […]
BY sarvi7 Sept 2016 2:30 AM IST
X
sarvi Updated On: 7 Sept 2016 8:11 AM IST
పిల్లనిచ్చారు.. ఉద్యోగమిచ్చారు.. ఇల్లరికం తెచ్చుకున్నారు.. ఇంటి పెత్తనమిచ్చారు.. కానీ ఆ పశువు మాత్రం పిల్లనిచ్చిన అత్తను, మరదళ్లను చెరపట్టాలని చూశాడు. అడ్డొచ్చిన వారిని చంపేస్తానని బెదిరించాడు. భర్త అకృత్యాలను భరించలేని భార్య అతడిని నరికి చంపిన ఘటన వరంగల్ జిల్లా భూపాలపల్లి పరిధిలో జరిగింది. జంగేడుకు చెందిన రేనుకుంట్ల నర్సయ్య, నిర్మల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. నర్సయ్య 2012లో అనారోగ్యంతో చనిపోయాడు. నిర్మల తన పెద్దకూతురు అనూషకు పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన పెండెల నాగరాజు(28)తో పెళ్లి జరిపించి ఇల్లరికం తెచ్చుకుంది. భర్త టోల్‌కాంటా పనిని అల్లుడికి ఇప్పించి పెద్ద దిక్కుగా ఉంటాడని ఆశపడింది.
కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. మద్యానికి బానిసైన నాగరాజు మరదళ్లు, అత్తను కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులు మొదలు పెట్టాడు. వీటిని చాలాకాలం పాటుమౌనంగా భరించారు. మగదిక్కు లేని సంసారం కావడంతో నాగరాజు ఆగడాలను పంటి బిగువున భరించారు. బయటికి చెబితే కూతురు సంసారం పాడవుతుందని, మిగిలిన కూతుళ్ల పెళ్లికాదని భయపడ్డారంతా. ఆదివారం తెల్లవారుజామున అత్త నిర్మలపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో నిద్రలేచిన అనూష భర్తను అడ్డుకుంది. నన్నే అడ్డుకుంటావా అంటూ నాగరాజు భార్య అనూషను గొడ్డలితో నరకబోయాడు. నాగరాజు చేతిలోని గొడ్డలిని లాక్కుంది అనూష. తిరిగి అదే గొడ్డలితో నాగరాజును నరికి చంపింది. తరువాత శవాన్ని బాత్ రూంలో పాతిపెట్టడానికి విఫలయత్నం చేశారు. సగం పూడ్చాక తమతో కాదని నిర్ణయించుకుని పోలీసులకు లొంగిపోయారు.
Next Story