రక్తికడుతున్న నాటకం... హోదా పుణ్యకాలం గడిచిపోతుందన్న సుజనా
ఏపీకి ప్రత్యేక హోదా రాజకీయం రసవత్తరంగా మారింది. పాత్రధారులం మేమే, సూత్రధారులం మేమే అన్నట్టుగా టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నామని ఢిల్లీలో మీడియాతో చెప్పిన సుజనాచౌదరి… అదే సమయంలో మరోవిషయం కూడా చెప్పారు. ప్రత్యేక హోదా రావాలంటే తిరిగి ఆ అంశాన్ని జాతీయ అభివృద్ది మండలి(ఎన్డీసీ)కి పంపాల్సి ఉంటుందని కేంద్రం చెబుతోందన్నారు. అలా ఎన్డీసీని నమ్ముకుంటే పుణ్యకాలం గడిచిపోతుందని సుజనా చౌదరే చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా హోదాకోసం పట్టుబడడం కంటే […]
ఏపీకి ప్రత్యేక హోదా రాజకీయం రసవత్తరంగా మారింది. పాత్రధారులం మేమే, సూత్రధారులం మేమే అన్నట్టుగా టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నామని ఢిల్లీలో మీడియాతో చెప్పిన సుజనాచౌదరి… అదే సమయంలో మరోవిషయం కూడా చెప్పారు. ప్రత్యేక హోదా రావాలంటే తిరిగి ఆ అంశాన్ని జాతీయ అభివృద్ది మండలి(ఎన్డీసీ)కి పంపాల్సి ఉంటుందని కేంద్రం చెబుతోందన్నారు. అలా ఎన్డీసీని నమ్ముకుంటే పుణ్యకాలం గడిచిపోతుందని సుజనా చౌదరే చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా హోదాకోసం పట్టుబడడం కంటే ఇచ్చిన ప్యాకేజ్ తీసుకుని సర్దుకుపోవడమే మంచిదని తేల్చేశారు. ఈ విషయంపై సాయంత్రానికి క్లారిటీ వస్తుందన్నారు.
రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యలతో సుజనా చౌదరి భేటీ అయి చర్చించారు. ఇటు విజయవాడలోనూ చంద్రబాబు హడావుడి మొదలుపెట్టారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై చర్చించారు.ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… విశాఖకు రైల్వే జోన్ దక్కకుండా విజయవంతంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. విశాఖ బదులు విజయవాడలో రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని నిన్న కేబినెట్ భేటీలో చంద్రబాబు అన్నట్టు ఆయన అనుకూల పత్రిక కథనాన్ని రాసింది. అయితే ఉత్తరాంధ్ర ప్రజల్లో బాబుపై వ్యతిరేక భావన రాకుండా ఉండేందుకు గాను… విశాఖ రైల్వే జోన్ కోసం చంద్రబాబు గట్టిగా పోరాడుతున్నారని అదే మీడియా సంస్థ ఇప్పుడు చెబుతోంది.
మొత్తం మీద చూస్తుంటే ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టేనని అర్థమవుతోంది. అదే సమయంలో రైల్వే జోన్ కూడా విజయవాడకు తరలించేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నట్టు అర్థమవుతోంది. హోదా వస్తుందా రాదా అని జనం హైరానా పడుతుంటే మధ్యలో సీఎం రమేష్ కూడా దూరారు. హోదా సంగతి మాట్లాకుండా వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ సెషన్స్‌లోనే ఇందుకు చట్టసవరణ చేసేందుకు కేంద్ర పెద్దలు అంగీకరించారని చెప్పుకొచ్చారు.
Click on Image to Read: