ఇండియాను హిందూ పాకిస్తాన్ కానివ్వం
చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలతో తెరపైకి వచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్‌ను హిందూ పాకిస్తాన్ గా మార్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఆ పార్టీ నేతలను చరిత్రను వక్రీకరించేందుకు కూడా వెనకాడటం లేదని విమర్శించారు. ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం చరిత్రను హైజాగ్ చేసేందుకు ప్రయత్నించినా.. వక్రీకరించాలని చూసినా.. మేం తప్పకుండా అడ్డుకుంటామన్నారు. స్వాతంత్ర్య పోరాట […]
BY sarvi6 Sept 2016 10:15 PM GMT
X
sarvi Updated On: 7 Sept 2016 2:39 AM GMT
చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలతో తెరపైకి వచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్‌ను హిందూ పాకిస్తాన్ గా మార్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఆ పార్టీ నేతలను చరిత్రను వక్రీకరించేందుకు కూడా వెనకాడటం లేదని విమర్శించారు. ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం చరిత్రను హైజాగ్ చేసేందుకు ప్రయత్నించినా.. వక్రీకరించాలని చూసినా.. మేం తప్పకుండా అడ్డుకుంటామన్నారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో వలసపాలకులకు వారు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. పైగా తాము దేశభక్తులమని నమ్మించే ప్రయత్నం చేయడం విడ్డూరమని ఆరోపించారు. ఇందుకోసం దేశభక్తులను కూడా వాడుకుంటోందని విమర్శించారు.
2014 పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీని.. వల్లభాయ్ పటేల్ తో పోలుస్తూ ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. చరిత్రను ఆ పార్టీ నేతలు సరిగా అర్థం చేసుకోలేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. 1947లో దేశ విభజన సమయంలో హిందూ- ముస్లింల కలహాలు జరిగినపుడు వల్లభాయ్ తక్షణం స్పందించారన్నారు. 2002లో గుజరాత్‌లోని గోద్రా అల్లర్లు జరిగినపుడు సీఎం గాఉన్న నరేంద్రమోదీకి స్పందించేందుకు 4 రోజులు ఎందుకు పట్టింది? అని సూటిగా ప్రశ్నించారు. ముస్లింల సంక్షేమం కోసం వల్లభాయ్ నిజాముద్దీన్ దర్గాకు వెళ్లి ప్రార్థించాడని, మోదీ అలా చేయగలడని మీరు కనీసం ఊహించగలరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. మేం అధికారంలో ఉన్నపుడు ఆధార్, జీఎస్టీ, బీమా బిల్లు, జన్ ధన్ యోజన, ఎఫ్‌డీఐల బిల్లులు తదితర పథకాలకు రూపకల్పన చేశామన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ వాటిని వ్యతిరేకించి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటినే అమలు చేస్తోందని దుయ్యబట్టారు.
Next Story