హిట్ కోసం రామ్ చరణ్ కష్టాలు...
ఒకప్పుడు కథ తరువాత హీరోలు . ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో తరువాత నే కథ. హీరోను కథ డామినేట్ చేయకూడదు. ఈ తరహా పద్దతి ఎక్కువ సార్లు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వక పోయినప్పటికి.. దర్శకులు మాత్రం హీరో సెంట్రిక్ ఫార్మేట్ నుంచి బయటకు రావడం లేదు. ఈ విషయంలో ఎవరి కష్టాలు వాళ్లవి. ఎవరి ఇష్టాలు వాళ్లవి అన్న చందంగా ఉంటుంది. అయితే అసలు విషయం ఏమిటంటే.. రామ్ చరణ్ ఎలాగైన ఒక భారీ హిట్ తన […]
ఒకప్పుడు కథ తరువాత హీరోలు . ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో తరువాత నే కథ. హీరోను కథ డామినేట్ చేయకూడదు. ఈ తరహా పద్దతి ఎక్కువ సార్లు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వక పోయినప్పటికి.. దర్శకులు మాత్రం హీరో సెంట్రిక్ ఫార్మేట్ నుంచి బయటకు రావడం లేదు. ఈ విషయంలో ఎవరి కష్టాలు వాళ్లవి. ఎవరి ఇష్టాలు వాళ్లవి అన్న చందంగా ఉంటుంది.
అయితే అసలు విషయం ఏమిటంటే.. రామ్ చరణ్ ఎలాగైన ఒక భారీ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చాలా కష్టపడుతున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తన్నీ ఓరువన్ చిత్రం రీమేక్ రైట్స్ కొని తెలుగులో ధృవ పేరుతో దర్శకుడు సురెందరెడ్డితో చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఈ చిత్రంలో హీరో కంటే విలన్ రోలే ఎక్కువుగా వుంటుంది. తమిళ్ లో ఈ రోల్ ను అరవింద్ స్వామి చేశారు. తెలుగులో కూడా అరవింద్ స్వామిని ఎంపిక చేశారు.
ఇప్పుడు ఈ సినిమా రీమేక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా హీరోకు కూడా ప్రాధాన్యత వుండేలా, అదే విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి ఆసక్తికరమైన విషయాలు వుండేలా దర్శకుడు సురేందర్ రెడ్డి కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేసి, ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. థని ఒరువన్ వున్నది ఉన్నట్లు తీస్తే, తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదని, అందుకే మార్పులు చేయాలని భావించి, ఆ విధంగా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పులు బాగుంటాయో, లేదో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.