Telugu Global
Cinema & Entertainment

రవితేజ కెరీర్ లో ఈ ఏడాది ఖాళీ...

2001లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా నుంచి ఏటా ఠంచనుగా ఓ హిట్ ఇస్తూ వస్తున్నాడు మాస్ రాజా. 2001నుంచి ఏ ఒక్క ఏడాది రవితేజ సినిమా మిస్ కాలేదు. కానీ కెరీర్ లోనే తొలిసారి రవితేజ ఈ ఏడాదిని మిస్ అవుతున్నాడు. గతేడాది వచ్చిన బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఫ్లాప్ రాకూడదనే ఉద్దేశంతో కథల ఎంపిక కోసం ఈ గ్యాప్ తీసుకున్నాడు. అలా రవితేజకు తెలియకుండానే 9 నెలలు […]

రవితేజ కెరీర్ లో ఈ ఏడాది ఖాళీ...
X

2001లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా నుంచి ఏటా ఠంచనుగా ఓ హిట్ ఇస్తూ వస్తున్నాడు మాస్ రాజా. 2001నుంచి ఏ ఒక్క ఏడాది రవితేజ సినిమా మిస్ కాలేదు. కానీ కెరీర్ లోనే తొలిసారి రవితేజ ఈ ఏడాదిని మిస్ అవుతున్నాడు. గతేడాది వచ్చిన బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఫ్లాప్ రాకూడదనే ఉద్దేశంతో కథల ఎంపిక కోసం ఈ గ్యాప్ తీసుకున్నాడు. అలా రవితేజకు తెలియకుండానే 9 నెలలు గడిపోయాయి. ఇప్పటికిప్పుడు సినిమా ఓకే చేసినా కూడా ఈ 3 నెలల్లో థియేటర్లలోకి రాదు. సో… ఈ ఏడాది రవితేజ నుంచి సినిమా లేనట్టే. దశాబ్దాల కెరీర్ లో ఎన్నడూ ఇలా జరగలేదు. ఏటా కచ్చితంగా మాస్ రాజా సినిమా ఉండేది. కానీ 2016 మాత్రం రవితేజకు బ్లాక్ ఇయర్ గానే మిగిలిపోనుంది. ప్రస్తుతానికైతే రవితేజ ఒకేసారి 2 సినిమాలు ఒకే చేశాడు. కానీ ఈ రెండూ షూటింగ్ పూర్తిచేసుకొని, రిలీజ్ అయ్యేసరికి 2017 వచ్చేస్తుంది. సో… 2016 టాలీవుడ్ క్యాలెండర్ రవితేజ బొమ్మ లేకుండానే గడిచిపోతుందన్నమాట. కచ్చితంగా రవితేజను డిసప్పాయింట్ చేసే వార్త ఇది. ఎందుకంటే ఏడాదికి కనీసం 2 సినిమాలైనా చేసే మాస్ రాజా.. ఈ ఏడాది కనీసం ఒక్కటి కూడా చేయలేకపోయాడంటే… ఈ హీరో ఎంత డిఫెన్స్ లో పడిపోయాడో అర్థం చేసుకోవచ్చు.

First Published:  7 Sept 2016 4:19 AM IST
Next Story