నయీం తో ఫొటోలు దిగిన ఎమ్మెల్యే... కేసు పక్కదారి పడుతోందా?
నయీం కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తున్నామని, నిందితులెవరినీ వదిలేదీ లేదని హోంమంత్రి ప్రకటనలను చాలామంది విశ్వసించడం లేదు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నయీంతో పాటు అత్యంత సన్నిహితంగా మెదిలిన ఫొటోలను సిట్ అధికారులు సంపాదించారు. నయీంకు రాజకీయ సంబంధాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏమి కావాలి అని చెప్పుకుంటున్నారు. మరో ఎమ్మెల్యేను స్పాట్ పెట్టేందుకే ఈ ఎమ్మెల్యేకు నయీం చేరువయ్యాడని, ఈ క్రమంలో అతడిని మచ్చిక […]
BY sarvi7 Sept 2016 5:50 AM IST
X
sarvi Updated On: 7 Sept 2016 7:32 AM IST
నయీం కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తున్నామని, నిందితులెవరినీ వదిలేదీ లేదని హోంమంత్రి ప్రకటనలను చాలామంది విశ్వసించడం లేదు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నయీంతో పాటు అత్యంత సన్నిహితంగా మెదిలిన ఫొటోలను సిట్ అధికారులు సంపాదించారు. నయీంకు రాజకీయ సంబంధాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏమి కావాలి అని చెప్పుకుంటున్నారు. మరో ఎమ్మెల్యేను స్పాట్ పెట్టేందుకే ఈ ఎమ్మెల్యేకు నయీం చేరువయ్యాడని, ఈ క్రమంలో అతడిని మచ్చిక చేసుకునేందుకు భారీగా తాయిలాలు కూడా ఇచ్చాడని సమాచారం. ఈ ఎమ్మెల్యే నయీం షాద్‌నగర్ డెన్‌కు వెళ్లినట్లు సిట్ పోలీసులు ఆధారాలు సంపాదించారు. టిఫిన్ చేస్తూ.. చాయ్ తాగుతూ ఇలా నయీంతో అంత సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూసిన పోలీసులు విస్తుపోయారు. ఈ ఎమ్మెల్యే తప్పించుకోవడం చాలా కష్టమని సమాచారం. ఇతన్ని అరెస్టు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీతో నయీం సాగించిన ఫోన్ సంభాషణల తాలూకు సీడీలను కూడా పోలీసులు సంపాదించగలిగారు.
ఇన్ని ఆధారాలను సిట్ పోలీసులు సంపాదించినా.. వీటిని బయటికి వెల్లడిస్తారా? అన్నది అనుమానమే అంటున్నారు పరిశీలకులు. మరోవైపు నయీం కేసు దర్యాప్తు పక్కదారి పడుతోందని, కొంతమంది రాజకీయ నాయకులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని కొందరు వాదిస్తున్నారు. చిన్న చిన్న ప్రజాప్రతినిధులను అరెస్టు చేస్తోన్న పోలీసులు పెద్దవారి విషయానికి వచ్చేసరికి మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నయీంతో సంబంధాలున్న పెద్ద నాయకులను కాపాడేందుకు తెరవెనక ప్రయత్నాలు ఊపందుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీలే ఇందుకు నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు.
Click on Image to Read:
Next Story