Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతికి నాగార్జున సినిమా

నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ పట్టుకుంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా మంచి హిట్ అవ్వడంతో నెక్ట్స్ సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలని నాగార్జున గట్టిగా ఫిక్స్ అయ్యాడు. తాజాగా ఏర్పాటుచేసిన ఓ సినిమా ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేస్తున్న ఓం నమోవేంకటేశాయ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు. నాగ్ సంక్రాంతి సెంటిమెంట్ ను […]

సంక్రాంతికి నాగార్జున సినిమా
X

నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ పట్టుకుంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా మంచి హిట్ అవ్వడంతో నెక్ట్స్ సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలని నాగార్జున గట్టిగా ఫిక్స్ అయ్యాడు. తాజాగా ఏర్పాటుచేసిన ఓ సినిమా ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేస్తున్న ఓం నమోవేంకటేశాయ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు. నాగ్ సంక్రాంతి సెంటిమెంట్ ను పక్కనపెడితే… ఓం నమో వేంకటేశాయ చిత్రం భక్తిరస ప్రధాన సినిమా కావడంతో… దీన్ని సంక్రాంతికి విడుదల చేస్తేనే మంచిదనే ఉద్దేశంతో యూనిట్ ఉంది. మరోవైపు సంక్రాంతి బరిలో ఇప్పటికే చిరంజీవి, బాలయ్య ఉన్నారు. బాలయ్య నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి, చిరంజీవి నటిస్తున్న ఖైదీ నంబర్-150 సినిమాలు సంక్రాంతికే వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంత పోటీ మధ్య నాగార్జున కూడా తన సినిమాను సంక్రాంతికే తీసుకొస్తానని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రగ్యా జైశ్వాల్, విమలారాన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుష్క ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

First Published:  7 Sept 2016 4:18 AM IST
Next Story