కోడెలకు ఊరట
స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుపై చంద్రబాబు ప్రభుత్వం రెండుకేసులు ఎత్తివేసింది. 2009 ఎన్నికల సమయంలో నమోదైన కేసులను ప్రభుత్వమే రద్దు చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి అనుచరులతో కలిసి అప్పట్లో కోడెల పెద్ద ప్రదర్శన చేశారు. తన ఇంటికి ఎదురుగా ఉన్న ఒక నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ ఆందోళన చేశారు. ఇది వ్యక్తిగత అంశం అయినప్పటికీ పార్టీ శ్రేణులను వెంటపెట్టుకుని… అడ్డుచెప్పిన పోలీస్ అధికారులపైనా అనుచితంగా ప్రవర్తించారన్నది ఆరోపణ. దీంతో కోడెల, అనుచరులపై కేసులు నమోదు […]
స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుపై చంద్రబాబు ప్రభుత్వం రెండుకేసులు ఎత్తివేసింది. 2009 ఎన్నికల సమయంలో నమోదైన కేసులను ప్రభుత్వమే రద్దు చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి అనుచరులతో కలిసి అప్పట్లో కోడెల పెద్ద ప్రదర్శన చేశారు. తన ఇంటికి ఎదురుగా ఉన్న ఒక నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ ఆందోళన చేశారు. ఇది వ్యక్తిగత అంశం అయినప్పటికీ పార్టీ శ్రేణులను వెంటపెట్టుకుని… అడ్డుచెప్పిన పోలీస్ అధికారులపైనా అనుచితంగా ప్రవర్తించారన్నది ఆరోపణ. దీంతో కోడెల, అనుచరులపై కేసులు నమోదు అయ్యాయి. చార్జిషీట్ కూడా దాఖలైంది. కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం కోడెలపై ఉన్న కేసులను ఎత్తివేసింది. ఈ మేరకు రెండు జీవోలను జారీ చేసింది ప్రభుత్వం.
Click on Image to Read: