తుస్సుమన్న జైట్లీ ప్రకటన... లక్షా 50 వేల కోట్లు ఎక్కడ?
ఉదయం నుంచి ఏపీ ప్రత్యేక ప్యాకేజ్‌పై కేంద్రం ప్రకటన చేస్తుందని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. రాత్రి 10.30 తర్వాత వెంకయ్యనాయుడు, సుజనా చౌదరితో కలిసి ప్రకటన చేసిన అరుణ్ జైట్లీ ఎప్పటిలాగే చేస్తాం, చూస్తామని ప్రకటించారు. లక్షా 50వేల కోట్ల ప్యాకేజ్ వచ్చేస్తోందని తెలుగు మీడియా ఛానళ్లు హడావుడి చేసినా అ లక్షా 50వేల కోట్లపై అరుణ్ జైట్లీ ఎక్కడా ప్రకటన చేయలేదు. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలు, కొండ […]
ఉదయం నుంచి ఏపీ ప్రత్యేక ప్యాకేజ్‌పై కేంద్రం ప్రకటన చేస్తుందని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. రాత్రి 10.30 తర్వాత వెంకయ్యనాయుడు, సుజనా చౌదరితో కలిసి ప్రకటన చేసిన అరుణ్ జైట్లీ ఎప్పటిలాగే చేస్తాం, చూస్తామని ప్రకటించారు. లక్షా 50వేల కోట్ల ప్యాకేజ్ వచ్చేస్తోందని తెలుగు మీడియా ఛానళ్లు హడావుడి చేసినా అ లక్షా 50వేల కోట్లపై అరుణ్ జైట్లీ ఎక్కడా ప్రకటన చేయలేదు. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు.
ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా నిబంధనలు వర్తిస్తాయని … కాబట్టి హోదా ఇవ్వాలని ఉన్నా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వాటికి సమానమైన ప్రయోజనాలు అంతకన్నా ఎక్కువ మేలే జరిగేలా చూస్తామన్నారు. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్‌పై సంబంధిత శాఖలే ప్రకటన చేస్తాయన్నారు. రైల్వే జోన్ ఎక్కడన్నది సురేష్ ప్రభు తేలుస్తారన్నారు. పన్ను మినహాయింపులు, ఏపీకి ఇచ్చే రాయితీలపై నోటిఫికేషన్‌ను కాసేపట్లో విడుదల చేస్తాం. నియోజకవర్గాల పునర్ విభజన సహా అనేక అంశాలు పరిశీలనలో ఉన్నాయన్నారు.
విభజన వల్ల ఏపీ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమేనని సానుభూతి వ్యాఖ్యలు చేశారు జైట్లీ. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి రూ. 2500 కోట్లు ఇచ్చామన్నారు. రెవెన్యూ లోటు కింద రూ. 3975కోట్లు ఇచ్చామన్నారు. ఏపీకి సాయంపై పూర్తి వివరాలను గురువారం వెబ్‌సైట్లో పెడుతామని ప్రకటించారు. మొత్తానికి అరుణ్ జైట్లీ ప్రకటనలో మాత్రం కొత్త విషయాలు కనిపించలేదు. వెబ్‌సైట్లో పెట్టే వివరాల్లో ఏముంటుందో చూడాలి. హోదా మాత్రం సాధ్యం కాదని అరుణ్ జైట్లీ సూటిగా, స్పష్టంగా చెప్పేశారు. ఆర్థికసాయంపై మాత్రం క్లారిటీ కనిపించలేదు. రోజంతా కొండంత రాగం తీసి చివరకు ఊసూరుమనించారు.
Click on Image to Read: