Telugu Global
NEWS

అసెంబ్లీలో మదర్ థెరిస్సాను అడ్డుపెట్టుకోవద్దు...

ఏపీ అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వైసీపీ తప్పుపట్టింది. కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సెయింట్‌ హుడ్‌గా ప్రకటించబడ్డ మదర్ థెరిస్సా, ఒలింపిక్ పతకం సాధించిన సింధులపై తీర్మానాల సాయంతో  ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా చూసేందుకు   చంద్రబాబుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మదర్ థెరిస్సా, సింధులు స్వశక్తితో ఖ్యాతిగడించారని .. వారి ఖ్యాతిని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే […]

అసెంబ్లీలో మదర్ థెరిస్సాను అడ్డుపెట్టుకోవద్దు...
X

ఏపీ అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వైసీపీ తప్పుపట్టింది. కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సెయింట్‌ హుడ్‌గా ప్రకటించబడ్డ మదర్ థెరిస్సా, ఒలింపిక్ పతకం సాధించిన సింధులపై తీర్మానాల సాయంతో ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా చూసేందుకు చంద్రబాబుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మదర్ థెరిస్సా, సింధులు స్వశక్తితో ఖ్యాతిగడించారని .. వారి ఖ్యాతిని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే తీరు సరికాదన్నారు. మదర్‌ థెరిస్సా, సింధులపై తీర్మానాలను తాము కూడా బలపరుస్తామని కానీ వాటితోనే సమావేశాలను సరిపెట్టవద్దని కోరుతున్నామన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేటలో కోడెల కుటుంబం చేస్తున్న ఆగడాలు, రావెల కిషోర్ బాబు కుమారుడు లేడీస్ హాస్టల్‌లోకి చొరబడడం, నయీంతో అచ్చెన్నాయుడు లింకులు, పయ్యావుల సోదరుడి హత్యారాజకీయాలు, యరపతినేని దందాలు, మొన్నటి ఎన్నికల్లో రూ. 11. 5కోట్లు ఖర్చు పెట్టానని స్పీకర్ కోడెల స్వయంగా చెప్పడం, రాష్ట్రంలో అవినీతి, రాయలసీమలో కరువు, పోలవరం, స్విస్ చాలెంజ్, విద్యుత్ కుంభకోణం, సదాపర్తి భూములు, బాక్సైట్ తదితర అంశాలపై చర్చ జరపాలన్నారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సమంజసమేనా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓటుకు నోటులో తాను తప్పు చేయలేదని చంద్రబాబు గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు.

Click on Image to Read:

chevi reddy bhaskar reddy

bhumana karunakar reddy

amaravathi capital lands

kvp ys jagan

kodela shiva rama krishna 1

lokesh vivekanda reddy ys jagan

cpi ramakrishna

ysrcp mla house arrest

america china

rosaiah

purandeswari1

nagarjuna 1

rgv

venkaiah niadu

mla manchireddy kishan reddy

First Published:  6 Sept 2016 8:08 AM IST
Next Story