మొన్న ల్యాప్‌టాప్‌లు.. నేడు స్మార్ట్‌ఫోన్లు!
తాయిలాలు ప్రకటించి ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడంలో మనదేశంలో రాజకీయ నాయకులను మించిన వారు ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరేమో! క్రితంసారి ఎన్నికల్లో ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించాడు అఖిలేశ్ యాదవ్. యువత ఈ పథకానికి బాగా ఆకర్షితులవడంతో ప్లాన్ వర్కవుటయి సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అఖిలేశ్ యాదవ్ సీఎం పీఠంపై కూర్చున్నాడు. అప్పుడు ల్యాప్‌టాప్‌లంటే క్రేజ్ కాబట్టి యువతను తనవైపునకు తిప్పుకోగలిగాడు. మరి ఈ ఐదేళ్లలో స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌లతో యూత్ మొత్తం […]
BY sarvi6 Sept 2016 5:28 AM IST
X
sarvi Updated On: 6 Sept 2016 8:06 AM IST
తాయిలాలు ప్రకటించి ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడంలో మనదేశంలో రాజకీయ నాయకులను మించిన వారు ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరేమో! క్రితంసారి ఎన్నికల్లో ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించాడు అఖిలేశ్ యాదవ్. యువత ఈ పథకానికి బాగా ఆకర్షితులవడంతో ప్లాన్ వర్కవుటయి సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అఖిలేశ్ యాదవ్ సీఎం పీఠంపై కూర్చున్నాడు. అప్పుడు ల్యాప్‌టాప్‌లంటే క్రేజ్ కాబట్టి యువతను తనవైపునకు తిప్పుకోగలిగాడు. మరి ఈ ఐదేళ్లలో స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌లతో యూత్ మొత్తం స్మార్ట్‌ఫోన్లలో మునిగితేలుతుంది. అందుకే, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే.. స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని ప్రకటించాడు.
ఎవరికి పడితే.. వారికి ఈ స్మార్ట్‌ఫోన్లు ఇవ్వరు. చిన్న మెలిక పెట్టారు. స్మార్ట్‌ఫోన్ కావాలనుకున్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వారి కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించి ఉండకూడదన్నారు. ఇంకేముంది స్మార్ట్‌ఫోన్ కావాలనుకుని 18 ఏళ్లు నిండినవారంతా ఈ ఆఫర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు మొదటివారం తరువాత ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ , సమాజ్‌వాదీ పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఎవరికి వారు ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటున్నారు. అందుకే, ప్రజలపై ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
Next Story