పులి ముందు లేగ దూడ నిలబడుతుందా?
టీడీపీ నాయకుడు లోకేష్‌ను పొగిడే క్రమంలో టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి సరికొత్త పోలిక తెచ్చారు. ఆ పోలిక బట్టి లోకేష్‌ను ఆనం పొడిగారా లేక లోకేష్ ఇంకా కుర్రాడే అని తేల్చారో కాస్త తికమకగానే ఉంది. లోకేష్ సంస్కారవంతుడు, వివేకవంతుడు అని వివేకా సర్టిఫికేట్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్న యువకుడు లోకేష్ అంటూ కితాబు ఇచ్చారు. ఇంతలోనే లోకేష్ ఒక లేగదూడ అని, జగన్ ఒక పులి అని అన్నారు. రాష్ట్రంలో ఎండలు […]
టీడీపీ నాయకుడు లోకేష్‌ను పొగిడే క్రమంలో టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి సరికొత్త పోలిక తెచ్చారు. ఆ పోలిక బట్టి లోకేష్‌ను ఆనం పొడిగారా లేక లోకేష్ ఇంకా కుర్రాడే అని తేల్చారో కాస్త తికమకగానే ఉంది. లోకేష్ సంస్కారవంతుడు, వివేకవంతుడు అని వివేకా సర్టిఫికేట్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్న యువకుడు లోకేష్ అంటూ కితాబు ఇచ్చారు. ఇంతలోనే లోకేష్ ఒక లేగదూడ అని, జగన్ ఒక పులి అని అన్నారు. రాష్ట్రంలో ఎండలు పెరిగినా, వర్షాలు ఆగినా, చివరకు సూర్యుడు ఆస్తమించినా అందుకు చంద్రబాబే కారణం అనేలా వైసీపీ తీరు ఉందన్నారు. జగన్ ప్రస్తుతం చేస్తున్నది అంతిమ పోరాటం అని అన్నారు. అన్ని బాగానే ఉన్నాయి గానీ లోకేష్‌ను లేగదూడతో పోల్చి జగన్‌ను పులితో పోల్చడమే ఆసక్తిగా ఉంది. పులి ముందు లేగదూడ నిలబడుతుందా?. ఒక వేళ జగన్ చెడ్డవాడు అని చెప్పేందుకు పులితో పోల్చి ఉంటారనుకునేందుకు తమకు తామే సింహాలం, పులులం అని చెప్పుకునేది ఎక్కువగా బాలకృష్ణ అండ్ బ్యాచే. ఇక వర్షాలు రాకపోవడానికి కారణం చంద్రబాబే అని విపక్షాలు అనడం, రాష్ట్రంలో ఏమీ జరిగినా, టీడీపీ నేతల పుత్రరత్నాల కార్లకు కుక్కలు అడ్డువచ్చినా అందుకు జగనే కారణమని టీడీపీ ఆరోపించడం కామనే గదా!.
Click on Image to Read: