జగన్‌కు ఎత్తిపొడుపు... బాబుకు అభయం!
చంద్రబాబును ఓటుకు నోటు కేసు, అవినీతి ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ మరోసారి వెంకయ్యనాయుడు మద్దతుగా నిలిచారు. ఏపీ అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థే నిర్ధారించిన నేపథ్యంలో… చంద్రబాబుపై విచారణకు కేంద్రం ఆలోచన చేస్తోందంటూ అప్పుడప్పుడు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందించారు. ‘కొంతమంది చంద్రబాబు భయపడుతున్నారని అంటున్నారు. ఆయనకు అక్కడ ఏవో ఉన్నాయని (కేసులు) అంటున్నారు. కాని చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకు సంబంధించి విచారణ ప్రతిపాదనలేవీ కేంద్రం […]
చంద్రబాబును ఓటుకు నోటు కేసు, అవినీతి ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ మరోసారి వెంకయ్యనాయుడు మద్దతుగా నిలిచారు. ఏపీ అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థే నిర్ధారించిన నేపథ్యంలో… చంద్రబాబుపై విచారణకు కేంద్రం ఆలోచన చేస్తోందంటూ అప్పుడప్పుడు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందించారు. ‘కొంతమంది చంద్రబాబు భయపడుతున్నారని అంటున్నారు. ఆయనకు అక్కడ ఏవో ఉన్నాయని (కేసులు) అంటున్నారు. కాని చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకు సంబంధించి విచారణ ప్రతిపాదనలేవీ కేంద్రం దగ్గర లేవు. ఇలాంటి చౌకబారు ప్రచారాలు, రాజకీయాలు చేయవద్దని కోరుతున్నా” అంటూ బాబుకు అభయం ఇచ్చారు.
ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందంటూ జగన్ చెప్పడంపై పరోక్షంగా వెంకయ్య స్పందించారు. అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హోదా వస్తే అన్ని రావన్నారు. నిధుల విషయంలో మాత్రమే తేడా ఉంటుందని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి అడిగింది తానేనని ఒప్పుకున్నారు. అప్పట్లో ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదని అందుకే అడిగానన్నారు. ఇప్పుడు కేంద్రం ఎన్నో అభివృద్ది పనులను చేస్తోందని చెప్పుకొచ్చారు. లోటు ఉన్న చోట దాన్ని పూరించాల్సిందిగా 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయడంతో పాటు రాష్ట్రాల మధ్య ఎక్కడా వ్యత్యాసం చూపొద్దని చెప్పిందన్నారు. దీని అర్థం పరోక్షంగా ప్రత్యేక హోదా ఆచరణ సాధ్యం కాదని సూచించడమేనని వెంకయ్య తేల్చేశారు.
ఒడిశా, బిహార్, పశ్చిమబంగ, అసోం.. ఇలా 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. తొమ్మిది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది ఆచరణ సాధ్యం కాదు. ఇస్తే ఆ హోదాకు అర్థం లేకుండా పోతుంది. ఏపీకి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని టీడీపీనేతలు ఆరోపిస్తుండగా వెంకయ్య మాత్రం ఇప్పటి వరకు రూ. 36వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. దీన్ని కూడా కొందరు ముష్టి వేయడం అంటున్నారని… 36 వేల కోట్లు అలాంటి వారికి పెద్ద మొత్తం కాకపోవచ్చన్నారు. పోలవరాన్ని ఇన్ని ఏళ్లలో పూర్తి చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.
Click on Image to Read: