Telugu Global
Cinema & Entertainment

కృష్ణవంశీ సినిమా కోసం కదలివచ్చిన రామ్ చరణ్

గతంలో చరణ్, కృష్ణ వంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే వారిద్దరికీ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఆ స్నేహంతోనే రామ్ చరణ్…. కృష్ణవంశీ కోసం ఓ పని చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్రం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నాడు. కె.శ్రీనివాసులు, వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. రెజీనా హీరోయిన్ […]

కృష్ణవంశీ సినిమా కోసం కదలివచ్చిన రామ్ చరణ్
X

గతంలో చరణ్, కృష్ణ వంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే వారిద్దరికీ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఆ స్నేహంతోనే రామ్ చరణ్…. కృష్ణవంశీ కోసం ఓ పని చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్రం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నాడు. కె.శ్రీనివాసులు, వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. సాయిధర్మతేజ, ప్రగ్యాజైశ్వాల్ గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. కృష్ణవంశీతో తనకు మంచి అనుబంధం ఉండడంతో పాటు… సినిమాలో సాయిధరమ్ తేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్న కారణంగా… నక్షత్ర సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎఁటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. పోలీస్ అవ్వాలనే పట్టుదలతో ఓ కుర్రాడు చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథలో కీలకమైన అంశంగా తెలుస్తోంది.

First Published:  5 Sept 2016 7:06 AM IST
Next Story