Telugu Global
NEWS

బొమ్మాళీ... ప‌శుప‌తి... తెలంగాణ‌లో కొత్త తిట్లు!

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు నిజామాబాద్ ఎంపీ క‌విత‌.. కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్‌, గ‌ద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ర‌స‌వత్త‌రంగా సాగుతోంది. జిల్లాల పున‌ర్వ్య‌వస్థీక‌ర‌ణలో శాస్ర్తీయ‌త లోపించ‌ద‌ని ఆరోపిస్తూ కొంత‌కాలంగా సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ వాఖ్య‌ల‌ను క‌విత ఘాటుగా తిప్పికొట్టారు. కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకుని గ‌ద్వాల కోట‌లో విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. ఈ మాట‌లు వీరిద్ద‌రి మ‌ధ్య మంట‌పెట్టాయి. అస‌లే డీకే అరుణ‌.. ఆపై ఫైర్‌బ్రాండ్ […]

బొమ్మాళీ... ప‌శుప‌తి... తెలంగాణ‌లో కొత్త తిట్లు!
X
తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు నిజామాబాద్ ఎంపీ క‌విత‌.. కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్‌, గ‌ద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ర‌స‌వత్త‌రంగా సాగుతోంది. జిల్లాల పున‌ర్వ్య‌వస్థీక‌ర‌ణలో శాస్ర్తీయ‌త లోపించ‌ద‌ని ఆరోపిస్తూ కొంత‌కాలంగా సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ వాఖ్య‌ల‌ను క‌విత ఘాటుగా తిప్పికొట్టారు. కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకుని గ‌ద్వాల కోట‌లో విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. ఈ మాట‌లు వీరిద్ద‌రి మ‌ధ్య మంట‌పెట్టాయి. అస‌లే డీకే అరుణ‌.. ఆపై ఫైర్‌బ్రాండ్ అన్న పేరు ఎలాగూ ఉండ‌నే ఉంది ఆమె ఎందుకు ఊరుకుంటుంది? అందుకే, నేను బొమ్మాళి అయితే.. మీ అయ్య కేసీఆర్‌.. ప‌శుప‌తినా? అంటూ మ‌రింత ఘాటుగా విమ‌ర్శించారు.
రెండు నెల‌ల కింద గ‌ద్వాల జిల్లా ఏర్పాటు చేయాల‌ని పాద‌యాత్ర నిర్వ‌హించిన అరుణ తాజాగా ఇందిరాపార్కు వ‌ద్ద రెండురోజుల‌పాటు నిరాహార దీక్ష చేప‌ట్టారు. అదే వేదిక‌పై నుంచి క‌విత వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టారు. కేసీఆర్‌ను ప‌శుప‌తితో పోలుస్తూ.. తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌న‌ను తాను జేజేమ్మ‌గా అంగీక‌రించ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఎవ‌రు బొమ్మాళి.. ఎవ‌రు ప‌శుప‌తి ? అన్న విష‌యాలు ప‌క్క‌న బెడితే.. మొత్తానికి తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు అరుంధ‌తి సినిమా పాత్ర‌ల‌తో తిట్టుకోవ‌డం మాత్రం చ‌క్క‌టి వినోదాన్ని, ఆస‌క్తిని పంచుతున్నాయి.
First Published:  5 Sept 2016 3:38 AM IST
Next Story