ఓ ఇంటివాడైన విక్రమ్ కుమార్
13బి అనే సినిమాతో మొదలుపెట్టి వైవిధ్యమైన సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు.. కొందరు మిత్రులు, మరికొందరు సినీ ప్రముఖుల మధ్య శ్రీనిధి మెడలో మూడుముళ్లు వేశాడు విక్రమ్ కుమార్. కొన్ని నెలలుగా శ్రీముఖి-విక్రమ్ కుమార్ ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసిందే. వీళ్ల ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో.. తొందరగానే మూడుముళ్లుతో ఒకటైపోయారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్టుడియోలో శ్రీనిథి సౌండ్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. 24 సినిమా […]
13బి అనే సినిమాతో మొదలుపెట్టి వైవిధ్యమైన సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు.. కొందరు మిత్రులు, మరికొందరు సినీ ప్రముఖుల మధ్య శ్రీనిధి మెడలో మూడుముళ్లు వేశాడు విక్రమ్ కుమార్. కొన్ని నెలలుగా శ్రీముఖి-విక్రమ్ కుమార్ ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసిందే. వీళ్ల ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో.. తొందరగానే మూడుముళ్లుతో ఒకటైపోయారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్టుడియోలో శ్రీనిథి సౌండ్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. 24 సినిమా టైమ్ లోనే విక్రమ్ కుమార్, శ్రీనిధి ఒకర్నొకరు బాగా దగ్గయ్యారు. ఇప్పుడు ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లికి రెహ్మాన్, హీరో సూర్య కుటుంబసభ్యులతో పాటు హాజరయ్యారు. మిగతా సినీప్రముఖులందరికీ గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చాడు విక్రమ్ కుమార్. పెళ్లి తర్వాత 3 నెలల పాటు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడు విక్రమ్ కుమార్. ఫ్యామిలీ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాతే కొత్త సినిమా ప్రారంభిస్తాడు. హీరో అఖిల్ రెండో సినిమాకు విక్రమ్ దర్శకుడిగా సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. 3 నెలల గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టుకుంటాడు విక్రమ్.