లైవ్ షోలో ఉద్యోగి కోసం ఒదిగిన జగన్
ప్రవాసాంధ్రుల లైవ్ షోలో జగన్ బాడీ ల్యాంగేజ్ చాలా పాజిటివ్‌గానే కనిపించింది. కార్యక్రమం సుధీర్ఘంగా సాగినప్పటికీ నవ్వుతూనే జగనే స్పందించారు. జగన్ పెద్దలను గౌరవించడన్న ఆరోపణలకు కూడా లైవ్ షోలో కొన్ని సంఘటనలు సమాధానం ఇచ్చాయి. తనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జగన్ ”అన్నా” అంటూ సంబోధించారు. కార్యక్రమంలో ఒకసారి టేబుల్ మీద ఉన్న కాగితాలు కిందపడిపోయాయి. ఆ సమయంలో జగన్ కిందకు ఒంగి వాటిని తీయబోయారు. ”వద్దు వద్దు” అంటూ […]
ప్రవాసాంధ్రుల లైవ్ షోలో జగన్ బాడీ ల్యాంగేజ్ చాలా పాజిటివ్‌గానే కనిపించింది. కార్యక్రమం సుధీర్ఘంగా సాగినప్పటికీ నవ్వుతూనే జగనే స్పందించారు. జగన్ పెద్దలను గౌరవించడన్న ఆరోపణలకు కూడా లైవ్ షోలో కొన్ని సంఘటనలు సమాధానం ఇచ్చాయి. తనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జగన్ ”అన్నా” అంటూ సంబోధించారు. కార్యక్రమంలో ఒకసారి టేబుల్ మీద ఉన్న కాగితాలు కిందపడిపోయాయి. ఆ సమయంలో జగన్ కిందకు ఒంగి వాటిని తీయబోయారు. ”వద్దు వద్దు” అంటూ జగన్ చేతిని కొమ్మినేని పట్టుకుని వారించారు. అయితే జగన్ పర్వాలేదంటూ కిందకు ఒంగి కాగితాలను తీసి కొమ్మినేనికి అందించారు. కొమ్మినేనిని ఒక ఉద్యోగిలా కాకుండా ఆయన వయసును, అనుభవాన్ని జగన్ గౌరవించిన విధానం కూడా బాగానే ఉంది. కార్యక్రమానికి విదేశాల నుంచి లైవ్‌లో హాజరైన వారిని కూడా వారివారి పేర్లతో పలకరించి జగన్ సమాధానాలు చెప్పిన విధానం మంచిగా అనిపించింది. అయితే కార్యక్రమంలో కొమ్మినేని కూడా సమయస్పూర్తిగా యాంకరింగ్ చేశారు. జగన్ తన యజమాని అయినప్పటికీ కొన్ని ప్రశ్నలను కొమ్మినేని జగన్‌కు సూటిగా సంధించి కార్యక్రమాన్ని రక్తికట్టించారు. మొత్తం మీద జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఇంతసుధీర్ఘంగా ఒక టీవీ లైవ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా జగన్ సమాధానాలు చెప్పారు.
Click on Image to Read: