వైఎస్ కదిలితే పంచె కట్టిన సింహంలా ఉండేదట... జగన్ మాత్రం...
పెళ్లి సమయంలో కొత్తజంటకు అరుంధతి నక్షత్రం చూపించినట్టుగా ఏపీ ప్రజలకు చంద్రబాబు అమరావతిని చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. అరుంధతి నక్షత్రం ఎలాగైతే కనిపించదో అమరావతి కూడా అలాంటిదేనన్నారు. మోదీ అహంకారం, చంద్రబాబు చేతగాని తనం కలవడం వల్లే ప్రత్యేకహోదా రావడం లేదన్నారు. చంద్రబాబుకు అనుభవం ఉంది, కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తారు… ఇద్దరు కలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతోనే టీడీపీకి జనం ఓటేశారన్నారు. అయినా కూడా కొద్దిపాటి ఓట్లతోనే టీడీపీ గెలిచిందన్నారు. వైఎస్ […]
పెళ్లి సమయంలో కొత్తజంటకు అరుంధతి నక్షత్రం చూపించినట్టుగా ఏపీ ప్రజలకు చంద్రబాబు అమరావతిని చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. అరుంధతి నక్షత్రం ఎలాగైతే కనిపించదో అమరావతి కూడా అలాంటిదేనన్నారు. మోదీ అహంకారం, చంద్రబాబు చేతగాని తనం కలవడం వల్లే ప్రత్యేకహోదా రావడం లేదన్నారు. చంద్రబాబుకు అనుభవం ఉంది, కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తారు… ఇద్దరు కలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతోనే టీడీపీకి జనం ఓటేశారన్నారు. అయినా కూడా కొద్దిపాటి ఓట్లతోనే టీడీపీ గెలిచిందన్నారు.
వైఎస్ వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్న వాదనను తులసిరెడ్డి ఖండించారు. వైఎస్ హయాంలో ఎక్కువగా లబ్ధిపొందినది తెలంగాణ ప్రాంతమేనని చెప్పారు. హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి వారే వైఎస్ దగ్గర ఎక్కువగా పనులు చేయించుకున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని,జగన్‌ను పోల్చి చూడడం సాధ్యం కాదన్నారు. వైఎస్ కదిలితే పంచెకట్టిన సింహం వచ్చినట్టుగా ఉండేదన్నారు. జగన్‌ను వైఎస్‌తో పోల్చలేమన్నారు. చంద్రబాబుకంటే కేసీఆర్ పాలనే కొంచెం బెటర్‌గా అనిపిస్తోందన్నారు.
ముఖ్యమంత్రులు చేసే తొలి సంతకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. వైఎస్ తొలి సంతకం చేసిన వెంటనే అది అమలులోకి వచ్చిందన్నారు. చంద్రబాబు తొలి సంతకం మాత్రం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా తయారైందన్నారు. రైతు రుణమాఫీ జరక్కపోవడంతో రైతులు వడ్డీలు కట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఎవరైనా తమ వద్దకు వస్తే నాలుగు మంచి మాటలు చెప్పడం సహజంగానే జరిగేదేనన్నారు. ఆ తరహాలోనే రాష్ట్రపతి కూడా చంద్రబాబుతో పాలన బాగుందని నాలుగు మాటలు అని ఉండవచ్చన్నారు. దాన్ని పట్టుకుని పదేపదే ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.
జగన్ కేసులు కోర్టులో ఉన్నందున వాటిపై మాట్లాడడం సరికాదన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని తులసిరెడ్డి అన్నారు. కులాల ప్రతిపాదికన రాజకీయాలుచేయడం అయ్యే పని కాదన్నారు. ఏ కులంలోనూ పూర్తి ఐక్యత ఉండదన్నారు.
Click on Image to Read: