మూడుసార్లు తలాక్… పాపమే...కానీ షరియత్ ఆమోదిస్తుంది!
మూడుసార్లు తలాక్ చెప్పి వివాహాన్ని రద్దు చేసుకోవటం పాపం…ఇంకా వివాహ రద్దుకి ఆచరించాల్సిన విధానాల్లో చిట్టచివరిది అయినా…ఈ విధానాన్ని ముస్లిం పర్సనల్ లా… షరియత్ ఆమోదిస్తుందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ఒక వ్యక్తి మూడుసార్లు తలాక్ చెప్పి… ముస్లిం మత గురువు ఉమర్ ఖలీఫా వద్దకు వెళ్లినపుడు ఆయన…ఆ వ్యక్తిని దండించమని ఆదేశించారని…అయితే ఆ భార్యాభర్తలు విడిపోవచ్చని తెలిపారని పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ఇస్లామిక్ పర్సనల్ లా మహిళలకు వ్యతిరేకంగా […]
మూడుసార్లు తలాక్ చెప్పి వివాహాన్ని రద్దు చేసుకోవటం పాపం…ఇంకా వివాహ రద్దుకి ఆచరించాల్సిన విధానాల్లో చిట్టచివరిది అయినా…ఈ విధానాన్ని ముస్లిం పర్సనల్ లా… షరియత్ ఆమోదిస్తుందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ఒక వ్యక్తి మూడుసార్లు తలాక్ చెప్పి… ముస్లిం మత గురువు ఉమర్ ఖలీఫా వద్దకు వెళ్లినపుడు ఆయన…ఆ వ్యక్తిని దండించమని ఆదేశించారని…అయితే ఆ భార్యాభర్తలు విడిపోవచ్చని తెలిపారని పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ఇస్లామిక్ పర్సనల్ లా మహిళలకు వ్యతిరేకంగా ఉందా….అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టు కోరగా… ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ మేరకు సుప్రీం కోర్టుకి సమాధానం ఇచ్చింది.
ఎలాంటి కారణం లేకుండా… భార్యకు హాని చేయాలనే ఉద్దేశంతోనే, ఆమె తను కోరినవి తేలేదనే ఆగ్రహంతోనే విడాకులు ఇస్తే అది షరియత్ లో పేర్కొన్న నిబంధనలకు వ్యతిరేకం అవుతుందని, అలా తలాక్ విధానాన్ని దుర్వినియోగం చేయటం నేరమవుతుంది కానీ… మూడుసార్లు తలాక్ చెప్పడంతో విడాకులు చట్టవిరుద్ధం కాదని లా బోర్టు పేర్కొంది. భార్యాభర్తలు ఇద్దరి అంగీకారంతో మూడుసార్లు తలాక్ చెప్పే పద్ధతిని షరియత్ అనుమతిస్తుందని తెలిపింది.
వారి గౌరవానికి భంగం కలగకుండా, వ్యక్తిగత విషయాలు బహిరంగం కాకుండా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకే ఈ పద్ధతి అమల్లోకి వచ్చిందని బోర్డు తెలిపింది. కుటుంబ విషయాలు నలుగురి నోళ్లలో నానకుండా, కోర్టు తీర్పు కోసం చాలా కాలం వేచి చూడకుండా సత్వర పరిష్కారమే తలాక్ విధానమని, ఒకరిపట్ల ఒకరికి ఇష్టంలేని బార్యాభర్తలు వీలయినంత త్వరగా ఆ చేదు బంధం నుండి బయటపడే అవకాశాన్ని ట్రిపుల్ తలాక్ విధానం ఇస్తుందని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. తలాక్ విధానం ఎల్లప్పుడూ ఏకపక్షంగా ఉంటుందని, ముస్లిం పురుషులు దీన్ని ఎల్లప్పుడూ దుర్వినియోగం చేస్తున్నారని అనుకోవటం అపోహేనని లా బోర్డు తెలిపింది. ముస్లిం మహిళలు…తక్షణమే తలాక్ పద్ధతి ద్వారా వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా తమ భర్తని కోరుతున్న సందర్భాలు చాలా ఉంటున్నాయని లాబోర్డు పేర్కొంది.