కోట్లాది రూపాయల జీతాలు చెల్లించేవాడు!
నయీం రెండు రాష్ర్టాల పరిధిలో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇందుకోసం భారీగా మనుషులను వాడుకున్నాడు. వీరిలో మాజీ మావోయిస్టులు, గుండాలు, పోలీసులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రకరకాల మనుషులు ఉన్నారు. ఎంత నయీం వద్ద పనిచేస్తే మాత్రం జీతం తీసుకోకుండా ఎవరైనా ఎన్ని రోజులు పనిచేస్తారు? అందుకే, నయీం తన వద్ద పనిచేసే వారందరికీ నెలనెలా ఠంచనుగా జీతాలు చెల్లించేవాడు. తన స్థావరాలు, డెన్‌ల నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా నెలనెలా తానే స్వయంగా లెక్కలు చూసి పంపేవాడంట. తన వద్ద పనిచేసే వారందరికీ సాదాసీదాగా […]
నయీం రెండు రాష్ర్టాల పరిధిలో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇందుకోసం భారీగా మనుషులను వాడుకున్నాడు. వీరిలో మాజీ మావోయిస్టులు, గుండాలు, పోలీసులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రకరకాల మనుషులు ఉన్నారు. ఎంత నయీం వద్ద పనిచేస్తే మాత్రం జీతం తీసుకోకుండా ఎవరైనా ఎన్ని రోజులు పనిచేస్తారు? అందుకే, నయీం తన వద్ద పనిచేసే వారందరికీ నెలనెలా ఠంచనుగా జీతాలు చెల్లించేవాడు. తన స్థావరాలు, డెన్‌ల నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా నెలనెలా తానే స్వయంగా లెక్కలు చూసి పంపేవాడంట. తన వద్ద పనిచేసే వారందరికీ సాదాసీదాగా కాకుండా.. కార్పొరేట్ స్థాయిలో భారీగా వేతనాలు అందజేసేవాడట. వీరిలో కేవలం రిటైర్డు ఉద్యోగుల కోసమే ప్రతినెలా ఏకంగా రూ.2 కోట్లు చెల్లించేవాడని తెలుసుకున్న పోలీసులు అవాక్కవుతున్నారు. తాను చట్టవ్యతిరేకంగా చేసిన పనులను క్రమబద్ధీకరించుకునేందుకే వీరి సేవలను వినియోగించుకునేవాడన్నమాట! ఏ రోజు చేసిన ఖర్చు వివరాలను ఆ రోజు రాయడం నయీంకు అలవాటు. ఆ అలవాటులో భాగంగా రాసిన డైరీలే ఇప్పుడు నయీం తన అనుచరులకు చెల్లించిన జీతాల వివరాల గురించి పోలీసులకు తెలిసేలా చేశాయి.
ఇంతమందికి జీతాలు చెల్లించినా.. ఏనాడూ నయీం వారిని ఎవరినీ నేరుగా కలిసి జీతం ఇచ్చింది లేదు. తన అనుచరుడు శేషన్న ద్వారానే వీరందరికీ జీతాల చెల్లింపులు జరిగేవి. నయీం తాను బెదిరింపులు, కిడ్నాపుల ద్వారా సంపాదించిన డబ్బును ఏనాడూ తనతోపాటు ఉంచుకునేవాడని తెలిసింది. తన ఖర్చుల వరకు ఉంచుకుని మిగిలిన డబ్బును ఎప్పటికప్పుడు స్థిరాస్థుల కోనుగోళ్లకు వెంటనే ఖర్చు చేసి పెట్టుబడి రూపంలోకి మార్చేవాడు. ప్రతినెలా నయీం తన వద్ద పనిచేసే దాదాపు 200 మందికి జీతాలు చెల్లించేవాడు. మొత్తానికి నయీం కంపెనీలో పనిచేసే.. ప్రతి ఒక్కరికి ఏనాడూ లేటు కాకుండా జీతాలు అందేవంటే.. నయీం వద్ద డబ్బు ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
Click on Image to Read: